Diwali Festival : హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలో శంఖానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మరి ముఖ్యంగా పరమశివుడికి శంఖం అంటే అత్యంత ప్రీతికరం. అలాగే లక్ష్మీదేవికి కూడా శంఖం అంటే ప్రీతికరమే. అందుకే శంఖాన్ని దైవంగా పూజించే వారిపై దేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని నమ్ముతారు. అంతేకాక పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరం మాదరాన్ని చిలికినప్పుడు వచ్చిన వస్తువులలో శంఖం కూడా ఒకటి. అందుకే హిందూ శాస్త్రంలో శంఖానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే హిందువులు చాలామంది వారి ఇండ్లలో శంఖాన్ని ఉంచుతారు. ఈ విధంగా ఇంట్లో శంఖం ఉంచడం వలన మంచి జరుగుతుందని వారి నమ్మకం. దీని కారణంగా ఇంట్లో ధన ప్రవాహం కూడా పెరుగుతుందట. అంతేకాక శంఖాన్ని పూరించడం వలన కొన్ని అదృష్టాలు కూడా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శంఖాన్ని ఇంట్లో ఏ దిక్కులో ఉంచుకోవాలో మీకు తెలుసా. శంఖాన్ని ఇంటిలో ఈ దిక్కులో పెడితేనే చాలా మంచి జరుగుతుందట.
అయితే శంఖాన్ని ఇంట్లో ఉంచాలి అనుకునేవారు తూర్పు దిశగా ఉంచి పూజ చేయడం చాలా మంచిదట. ఈ విధంగా తూర్పుదిక్కులో శంఖాన్ని ఉంచి పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందనిజ్యోతిష్య నిబంధనలో చెబుతున్నారు. అంతేకాక శంఖాన్ని భద్రపరిచే స్థలం కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇక శంఖాన్ని ఉంచే స్థలంలో ఎరుపు లేదా పసుపు రంగుగుడ్డ ముక్కును ఉంచి దానిపై శంఖాన్ని ఉంచాలి. అదేవిధంగా శంఖాన్ని పూరించినప్పుడుఇంట్లోకూల శక్తులన్నీ నశిస్తాయి. ఇక శంఖాన్ని పూరించిన అనంతరం కచ్చితంగా శంఖాన్ని గంగాజలంతో శుభ్రం చేసి తుడవాలి.
ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న శంఖం ఇంట్లో ఉంచి పూజించడం అనేది చాలా శుభప్రదం. అయితే ఈ శంఖం ని దీపావళి కంటే ముందు రోజు ఇంట్లోకి తీసుకొస్తే చాలా మంచిదట. దీనివలన అమ్మవారి అనుగ్రహం లభించి మీ ఇంట్లోలక్ష్మీదేవి ప్రవహిస్తుంది. త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే శంఖం నుండి వెలువడే సానుకూల శక్తి ఇంటి మొత్తం వ్యాపించి ప్రతికూల శక్తిని నశింపజేస్తుంది. దీంతో మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ,మారుతుంది. సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీపావళి కంటే ముందే శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజించండి. కచ్చితంగా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.