
A Big Story Behind Liger Movie Secrets Revealing
Liger Movie : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకున్నారు. ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ రోల్‌లో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించారు. భారీ అంచనాల మధ్య ఆగష్టు 25న విడుదల అయిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది.
ఇటీవల కాలంలో ఆచార్య తర్వాత అంత పెద్ద డిజాస్టర్ విజయ్ దేవరకొండ లైగర్. ఈ సినిమా ఏకంగా 65 – 70 శాతం భారీ నష్టాలు తెచ్చిపెట్టిందంటున్నారు. అయితే ఈ సినిమాపై ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియాలో కూడా నెగటివ్ టాక్ భారీ ఎత్తునే నడిచింది. నైజాంకు చెందిన వరంగల్ శ్రీను ఈ సినిమాకు కొందరు కావాలనే వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీను సంచలన విషయాలు మాట్లాడారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమ చాలా చెడ్డ దశలో ఉందని.. కొందరు నటులతో పాటు, డైరెక్టర్లను కూడా బ్యాన్ చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
A Big Story Behind Liger Movie Secrets Revealing
నటులు, దర్శకుల మీద వ్యక్తిగత కక్షలతో జరిగే ఇలాంటి ప్రచారాల వల్ల సినిమాలు తగ్గుతాయని… దీంతో సినిమా పరిశ్రమ ఆధారపడి బతికే వేలాది మంది పేద కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతున్నాయని అన్నారు. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం వరకు ఓకే గాని… అయితే లైగర్ రిలీజ్‌కు ముందు నుంచే ఆ సినిమాను చూడకుండానే కొందరు కావాలని నెగటివ్ ప్రచారం గట్టిగా చేశారు అని వాపోయాడు. లైగర్ సినిమా క్లైమాక్స్ చివరి 7-10 నిమిషాలు బాగోలేదని.. సినిమా ఉండాల్సినంత లేకపోవడంతో సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పాడు. అయితే సినిమాకి నెగెటివ్ ప్రచారం చేసిన వారెవరు అనే విషయం చర్చకు రాగా, మెల్లమెల్లగా ఒక్కో విషయం బయటకు వస్తుంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.