Bullet Bhaskar : బుల్లెట్ భాస్కర్ అంటే ఖుష్బు కు ఎందుకు అంత అభిమానమో తెలిస్తే షాక్ అవుతారు..!!
Bullet Bhaskar : జబర్దస్త్ కామెడీ షో లో జోడి అంటే యాంకర్ రష్మీ మరియు సుడిగాలి సుదీర్ పేర్లు గుర్తుకు వచ్చేవి. వారిద్దరి తర్వాత జబర్దస్త్ లో చాలా మంది జోడీలు కట్టారు. కానీ ఏ ఒక్కరి జోడి కూడా ఆకట్టుకోలేదు. మధ్యలో వర్ష మరియు ఇమాన్యుల్ జోడి కాస్త నవ్వించే ప్రయత్నం చేసిన కూడా వారిద్దరి మధ్య ఉన్నది ఫేక్ లవ్ అంటూ చాలా మందికి అర్థం అయిపోయింది. అందుకే వారిని జనాలు పట్టించుకోవడం మానేశారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ స్టేజ్ పై బుల్లెట్ భాస్కర్ మరియు జడ్జ్ కుష్బూ ల జోడి తెగ హడావుడి చేస్తుంది. వీరిద్దరూ ప్రతి ఎపిసోడ్ లో కూడా డాన్స్ చేయడం లేదంటే ఇద్దరి మధ్య రొమాంటిక్ సంభాషణలు
A romantic dance between Bullet Bhaskar and Khushboo
సాగడం కామన్ అయింది. తాజాగా విడుదలైన ఒక ఎపిసోడ్ ప్రోమోలో ఏకంగా ఇద్దరు కలిసి డాన్స్ చేయడం.. అది కూడా రొమాంటిక్ సాంగ్ చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో డాన్స్ చేసిన కుష్బూ ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ కుష్బూ బుల్లెట్ భాస్కర్ తో డాన్స్ చేయాల్సి రావడం విడ్డూరంగా ఉంది అంటూ చాలా మంది ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా షో యొక్క రేటింగ్ కోసమే అని తెలిసినా కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఇలాంటి బాండింగ్ ఎలా ఏర్పడింది అనేది అందరికీ అర్థం కాని ప్రశ్న.
A romantic dance between Bullet Bhaskar and Khushboo
అసలు విషయం ఏంటంటే ఒక ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ అత్యంత చెత్త డాన్స్ మూమెంట్స్ చేశాడు. వాటికి కుష్బూ తెగ నవ్వేసింది.. మళ్లీ మళ్లీ బుల్లెట్ భాస్కర్ తో ఆ డాన్స్ ని చేయించింది. అలా ఇద్దరి మధ్య ప్రతి ఎపిసోడ్ లో కూడా ఏదో ఒక డాన్స్ కి సంబంధించిన మాటలు లేదా డాన్స్ మూమెంట్స్ పెడుతూ వస్తున్నారు. అసలే రేటింగ్ లేకుండా కొనసాగుతున్న జబర్దస్త్ ఇలాంటి చిన్న చిన్న మ్యాజిక్ లతో అయినా రేటింగ్ దక్కించుకుంటుందేమో అని నిర్వాహకులు ఆశపడుతున్నారు. అంతే తప్ప కుష్బూ మరియు బుల్లెట్ భాస్కర్ మధ్య ఏదో ఉందని అస్సలు అనుకోవద్దు.
