ఆచార్య సినిమా మీద దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో ఉత్కంఠత నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి 151 గా సైరా వచ్చి ఎన్నో నెలలు గడిచిపోయింది. వాస్తవంగా చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని భావించారు. కాని సైరా సినిమా పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆచార్య సినిమా కథలో కీలక మార్పుల వల్ల 152 గా రావాల్సిన ఆచార్య సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. అయితే ఎంత ఆలస్యం అవుతున్నా కూడా ఆచార్య సినిమా మీద ప్రతీ ఒక్కరిలో ఇండస్ట్రీ రికార్డ్ సాధిస్తుందన్న నమ్మకం అంతగా పెరిగిపోతోంది.
అందుకు కారణం దర్శకుడు కొరటాల శివ. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటూ ఎరగని దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సామాజిక అంశానికి చిరంజీవి రేంజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి రూపొందిస్తుండటమే. ఇక ఇప్పటికే ఈ సినిమాకోసం వేసిన భారీ టెంపుల్ సెట్ ట్రెండింగ్ లో నిలిచింది. కొరటాల శివ ఆచార్య కోసం ఎంచుకున్న కథ.. కథనం లో యూనివర్సల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాలో సిద్ద పాత్రలో నటించబోతున్న రాం చరణ్ కూడా జాయిన్ అయ్యాడు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో రెజీనా.. కీలక పాత్రల్లో సోనూసూద్ లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావస్తోందట. ఈ క్రమంలో ఆచార్య ప్రమోషన్స్ ని మొదలు పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 26 న టీం టీజర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు టీజర్ రిలీజ్ దగ్గర్నుంచి వరసగా పోస్టర్స్.. లిరికల్ సాంగ్స్ … ట్రైలర్ తో ఆచార్య ప్రమోషన్స్ ని పీక్స్ లో నిర్వహించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కాగా మెగాస్టార్ నటించిన 153 తాజాగా ఓపెనింగ్ జరిగింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.