
Actor Nandu About Rashmi Gautam Remuneration
Rashmi Gautam : ప్రముఖ గాయిని గీతా మాధురి భర్త నందు హీరోగా పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆయనకు సక్సెస్ ని తీసుకు రాలేక పోయాయి. దాంతో కేవలం సినిమా పై ఆధార పడితే సరిపోదనే ఉద్దేశ్యంతో సిరీస్ లు మరియు టీవీ చానల్స్ లో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. చాలా రోజుల క్రితం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాను నందు పూర్తి చేశాడు. కొన్ని కారణాలవల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ వారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మి గౌతమ్ మరియు హీరో నందు ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉంటాయట.
చాలా సంవత్సరాల క్రితం గుంటూరు టాకీస్ అనే సినిమాలో సిద్దు జొన్నలగడ్డతో రష్మీ గౌతమ్ చేసిన రొమాన్స్ ఇప్పటికే జనాలు మర్చి పోవడం లేదు. ఆ రేంజ్ లో కాకున్నా కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ లో నందు మరియు రష్మి గౌతమ్ ల యొక్క రొమాన్స్ పిక్స్ లో ఉంటుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మరియు సినిమా మేకింగ్ విజువల్స్ ప్రస్తుతం సినిమా లో నందు మరియు రష్మి గౌతమ్ యొక్క రొమాంటిక్ సన్నివేశాల కోసమైనా సినిమా ని చూడాలని కోరుకుంటున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా లో నటించినందుకు గాను రష్మి గౌతమ్ భారీ పారితోషికం పొందినట్లుగా సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. రోజు వారి పారితోషికం కాకుండా సినిమా కు ఆమె బల్క్ రెమ్యూనరేషన్ పొందిందట. సాధారణంగా కంటే దాదాపు రెట్టింపు రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలొస్తున్నాయి.
Actor Nandu About Rashmi Gautam Remuneration
హీరో నందు కి పెద్దగా క్రేజ్ లేదు.. పైగా అతనితో రొమాంటిక్ సన్నివేశాలు.. అందుకే రష్మీ గౌతమ్ కాస్త ఎక్కువ డిమాండ్ చేసిందని, నిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పి ఆమె అడిగిన పారితోషికం ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం అందుతుంది. సినిమా లో ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే రొమాంటిక్ సీన్స్ ఉంటాయని.. అయినా కూడా ఆమె ఎక్కువగానే చార్జ్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా పలు కార్యక్రమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తూ భారీగా పారితోషకం తీసుకుంటున్న రష్మి గౌతమ్ ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అవసరమా అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ముందు ముందు మరిన్ని రొమాంటిక్ సినిమాల్లో నటించాలని రష్మి గౌతమ్ ను కోరుతున్నారు. రష్మి గౌతం బొమ్మ బ్లాక్ బస్టర్ తర్వాత మరిన్ని సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.