Hari teja : బుల్లితెర తారలు ఈ మధ్య చేసుకుంటున్న ప్రమోషన్స్, సోషల్ మీడియాలో సంపాదిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరూ కూడా యూట్యూబ్ చానెల్ పెట్టేస్తున్నారు. ఇక యూట్యూబ్ చానెల్ పెట్టే ముందు వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఏదో పెద్ద న్యూస్ చెప్పబోతోన్నాం.. ఎగ్జైటింగ్ న్యూస్ అంటూ హడావిడి చేస్తుంటారు. తీరా చూస్తే తమ కొత్త యూట్యూబ్ చానెల్‌ను లాంచ్ చేస్తుంటారు. తాజాగా హరితేజ కూడా ఇలాంటి ఓ విషయం మీదే మాట్లాడింది.
అదిరిపోయే అప్డేట్ చెప్పబోతోన్నా. అదేంటో గెస్ చేస్తూ ఉండండి. నాకు తెలుసు మీరు గెస్ చేస్తారు.. అలా గెస్ చేస్తూనే ఉండండి.. అందులోని కొన్నింటిని నేను షేర్ చేస్తాను అని హరితేజ కాస్త అతి చేసింది. దీంతో నెటిజన్లు తమ కొంటెతనానికి పదును పెట్టేశారు. మీ ఆయన బిగ్ బాస్ షోకు వెళ్తున్నారా? మీరు మళ్లీ బిగ్ బాస్ షోకు వెళ్తున్నారా? ఆచార్య సినిమాలో నటిస్తున్నారా? పవన్ కళ్యాణ్‌తో నటించే చాన్స్ వచ్చిందా? హీరోయిన్‌గా అవకాశం వచ్చిందా? అంటూ రకరకాలుగా కామెంట్లు పెట్టేశారు.
ఇంత హడావిడి చేస్తున్నారంటే అది కచ్చితంగా యూట్యూబ్ చానెల్ కోసమే కదా? అని ఓ నెటిజన్ పరువుతీసేశాడు. పని పాట లేనట్టు అందరూ యూట్యూబ్ చానెల్ మీద పడుతున్నారు? అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు.
వాటిపై హరితేజ కాస్త సెటైరికల్‌గానే స్పందించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. మళ్లీ పిల్లల్ని కంటున్నావా? ప్రెగ్నెంట్‌వా అని అడిగేశాడు. ఆ ప్రశ్నకు హరితేజ ఖంగుతిన్నట్టుంది. మొత్తానికి హరితేజ నేడు సాయంత్రం లైవ్‌లోకి వచ్చి క్లారిటీ ఇస్తుందట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.