Home » Entertainment » Actress Poorna About Aadi Sai Kumar Behaviour
Entertainment

Poorna : ఆది సాయి కుమార్ అలాంటి వాడట.. అసలు విషయం చెప్పిన పూర్ణ

Authored By
aruna
The Telugu News | Published on: August 15, 2022, 6:40 pm
Advertisement

Poorna : ప్రస్తుతం ఆది సాయి కుమార్ స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఇందులో పూర్ణ కూడా ఓ పాత్రలో నటిస్తోంది. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అలరించనుంది.

Advertisement

నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఈక్రమంలో ఈ చిత్రయూనిట్ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు వచ్చింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో వీరంతా సందడి చేశారు.

Actress Poorna About Aadi Sai Kumar Behaviour

Advertisement

తీస్ మార్ ఖాన్ సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్ చేసుకున్నారు. అయితే ఈక్రమంలోనే స్టేజ్ మీద ఆది గురించి పూర్ణ కొన్ని విషయాలు చెప్పినట్టుంది. మోస్ట్ బోరింగ్ కో స్టార్ అంటూ ఆది మీద పూర్ణ ఆరోపణలు చేసింది. సెట్‌లో ఎంతో సైలెంట్‌గా ఉంటాడని, బోరింగ్ అనిపిస్తాడని ఇలా పూర్ణ కాస్తా రష్మీకి చెప్పినట్టుంది. ఇదే మాటలు ఆది ముందే స్టేజ్ మీద రష్మీ అనేసింది.

Poorna : ఆదితో బోరింగ్ అంట..

కానీ తాను అంత బోరింగ్ ఏమీ కాదని, మీతో బాగానే మాట్లాడాను కదా? అంటూ పూర్ణతో ఆది సాయి కుమార్ అంటాడు. మీరు ఈ షోలో అందరినీ ఎంటర్టైన్ చేసి ఆ ఆరోపణ నిజం కాదని నిరూపించుకోవాలనే టాస్క్ రష్మీ ఇచ్చింది. ఆ తరువాత రష్మీతో, లేడీ గ్యాంగుతో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు ఆది. సాయి కుమార్ డైలాగ్ చెప్పి అందరినీ అలరించడంతో.. బోరింగ్ కాదని రష్మీ సర్టిఫికేట్ ఇచ్చింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి