Home » Entertainment » Adivi Sesh Yarlagadda Supriya Relati0nshp Is In Doubt
Entertainment

Adivi Sesh – Supriya : మీరు పెళ్లి చేసుకోవాడానికి వీల్లేదు .. అడివి శేష్ సుప్రియ ల ప్రేమ కి బిగ్ షాక్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 6, 2023 1:03 pm
Advertisement

Adivi Sesh – Supriya : టాలీవుడ్‌లో కొన్ని సీక్రెట్ ప్రేమాయాణాలు సాగుతూ ఉంటాయి. కొంద‌రు బ‌హిరంగంగానే చెట్ట‌ప‌ట్టాలు వేసుకుంటుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం సీక్రెట్ గా వ్య‌వ‌హ‌రం న‌డిపిస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ ఉండ‌గా, వారిలో డార్లింగ్ ప్రభాస్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, అడివి శేష్.. ఇలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. ఆ హీరోలు వారి కెరీర్ లో బిజీ అయ్యేసరికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా క్లారిటీ ఇవ్వకుండా ఏదోకటి చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ టీవీ షోతో పాటు అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న అడివి శేష్.. పెళ్లి గురించి అడిగితే ప్రభాస్, శర్వానంద్ ల పేర్లు చెబుతూ నాకంటే సీనియర్స్ ఉన్నారని వారి త‌ర్వాత

Advertisement

చేసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. అడివి శేష్ ప్రేమ వ్య‌వ‌హారినికి సంబంధించి కొన్నాళ్లుగా అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియతో అడివి శేష్‌కి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటివరకు అటు శేష్ గానీ, ఇటు సుప్రియ గానీ స్పందించలేదు. కానీ.. ఇటీవ‌ల చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోని చూపిస్తూ రిలేషన్ నిజమేనంటూ ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటో బట్టి చూస్తే.. శేష్, సుప్రియ లవ్ లో ఉన్నారని అభిప్రాయాలు అభిమానుల‌లో వ్యక్తం అవుతున్నాయి. అయినా.. ఇంకా ఎందుకని వీరిద్దరూ లవ్ మ్యాటర్ ని అధికారికంగా ప్రకటించట్లేదు అనే ప్రశ్న కూడా అంద‌రిలో ఉత్ప‌న్నం అయింది. క్రిస్మస్ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Adivi Sesh yarlagadda supriya Relati0nshp is in doubt

Advertisement

అక్కినేని ఫ్యామిలీ క్రిస్మస్ పార్టీలో హీరో అడివి శేష్ సైతం పాల్గొన్నాడు. ఆ సెలబ్రేషన్స్ ఫోటోలను అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అంద‌రి దృష్టి అడివి శేష్ పై ప‌డింది. పిక్ లో శేష్ పక్కన సుప్రియ.. ఒకరినొకరు చూసుకుంటూ కనిపించేసరికి.. వీరి జంటని అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడో ఓకే చేసినట్లుగాచెబుతున్నారు. అయితే.. దాదాపు నాలుగేళ్లుగా శేష్, సుప్రియల పేర్లు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. త్వ‌ర‌లో ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటారు అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, వారి పెళ్లికి ఓ వ్యక్తి బ్రేక్ వేసిన‌ట్టు తెలుస్తుంది. యార్లగడ్డ ఫ్యామిలీ లో ఒక మేనమామ ఉన్నాడు . ఆయన మాట కుటుంబంలో బాగా చెల్లుబాటు అవుతుంది. అడివి శేష్ తో సుప్రియ పెళ్ళికి ఆయ‌న ఒప్పుకోవట్లేద‌ట‌. దాంతో అందరూ కంగారూ గా ఉన్నార‌ని తెలుస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి