
aha Comedy Stock Exchange interesting update
Comedy Stock Exchange : ఆహా ఓటీటీ లో ఇటీవలే స్ట్రీమింగ్ ప్రారంభం అయిన కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ మూడు నాళ్ల ముచ్చట అన్నట్లుగానే ముగియబోతుంది అంటూ సమాచారం అందుతోంది. ఇప్పటికే సీజన్ 1 షూటింగ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఆరు ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ కూడా చేశారు. మరో రెండు లేదా నాలుగు ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సీజన్ 1 అప్పుడే పూర్తి అవ్వబోతుంది. ఈ సమయంలో సీజన్ 2 గురించిన చర్చ జరగలేదు. కనుక అసలు సీజన్ 2 ఉంటుందా లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీజన్ 2 ఉండని కారణంగానే సద్దాం టీమ్ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో పట్ల అనిల్ రావిపూడి కూడా ఆసక్తిగా లేడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన బాలకృష్ణ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టాడు. మళ్లీ ఆయన షో కి హాజరు అవ్వాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు. అందుకే ఈ షో రెండవ సీజన్ ఉండదు అంటూ చాలా బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.ఇక ఆహా వారు కూడా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో కు వస్తున్న
aha Comedy Stock Exchange interesting update
ఆదరణ పట్ల సంతృప్తిగా లేరు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు కామెడీ షో అంటే జబర్దస్త్ తప్ప మరే షో ను ఆధరించడం లేదు. కనుక కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అదే తీరుగా ఆకట్టుకునే విధంగా ఉన్నా కూడా జబర్దస్త్ కాదు కదా అంటూ తిరష్కరిస్తున్నారట. అందుకే షో కు చెందిన వారు ఎటు వాళ్లు అటు వెళ్లి పోయారు. సద్దాం మరియు యాదమరాజు లు జబర్దస్త్ కి వెళ్లి పోయారు. ఇక ఇతరులు కూడా వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.