Home » Entertainment » Aha Ott Going To Start A Dhee Dance Show Very Soon
Entertainment

Dhee Dance Show : ఢీ డాన్స్‌ షో కు ఎసరు పెట్టబోతున్న ఆహా ఓటీటీ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 24, 2022, 8:00 pm
Advertisement

Dhee Dance Show : ప్రస్తుతం ఈటీవీ కాస్త రేటింగ్ విషయంలో.. నెంబర్ గేమ్‌ లో నిలుస్తున్నది అంటే అది ఖచ్చితంగా జబర్దస్త్‌ మరియు ఢీ డాన్స్ షో వల్ల అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు బాల సుబ్రమణ్యం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆధ్వర్యంలో నడిచిన పాడుతా తీయగా సింగింగ్ షో గురించి ఇప్పుడు జనాలు పట్టించుకోవడం లేదు. ఢీ డాన్స్ షో ను ఒకప్పుడు బాగా చూసేవారు. ముఖ్యంగా సుధీర్ ఇంకా రష్మీ ఉన్న సమయంలో అంతా కూడా రిపీట్ రిపీట్‌ చేస్తూ చూసేవారు. కాని ఢీ డాన్స్ షో నుండి వారు తప్పుకోవడం తో ఈ సీజన్ కు దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది అంటూ స్వయంగా ఈటీవీ వారు చెబుతున్నారు.

Advertisement

ఢీ డాన్స్ షో ను ఇప్పటికి కూడా డాన్స్ మీద ఆసక్తి ఉన్న వారు చూస్తూ వస్తున్నారు. ఈ సమయంలో ఢీ షో కు ఒక గట్టి పోటీ ఇచ్చేందుకు ఆహా సిద్దం అయ్యింది అంటూ సమాచారం అందుతోంది. ఢీ కి ఏమాత్రం తగ్గకుండా ప్రముఖ యాంకర్ ఆధ్వర్యంలో ఆహా వారు డాన్స్ షో ను నిర్వహించబోతున్నారు. ఇటీవలే తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అందుకే ఇప్పుడు డాన్స్ షో ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆహా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్ మాస్టర్‌ ఇందుకు సిద్దం అన్నట్లుగా ఇప్పటికే ఆహా టీమ్ కు గ్రీన్ కార్డ్‌ చూపించాడని ఆయన కాకుండా ఇంకా కొందరు జడ్జ్ లు కూడా ఇప్పటికే రెడీ గా ఉన్నామని చెప్పారట.

Aha OTT going to start a Dhee Dance Show very soon

Advertisement

ఆహా వారు ఢీ షో స్థాయి లో డాన్స్ షో ను మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా అనూహ్యంగా స్పందన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆహా లో ఆ షో కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. స్వయంగా ఆహా వారు నిర్మించబోతున్నారు. మరో వైపు ఉత్తరాది డాన్స్ కాంపిటీషన్ షో హక్కులు కొనుగోలు చేయడం ద్వారా దాన్ని ఇక్కడ నిర్వహించాలా అనే అంశంలో కూడా ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏది ఏమైనా ఈ ఏడాది చివరి వరకు బాలయ్య అన్‌ స్టాపబుల్‌ తో పాటు డాన్స్ షో ను కూడా నిర్వహించేందుకు ఆహా టీమ్‌ వారు ప్రయత్నాలు ప్రారంభించారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం ఢీ డాన్స్ షో కు వస్తున్న రేటింగ్ గతంలో ఎప్పుడు రాలేదు అనేది టాక్‌. ఇలాంటి సమయంలో ఆహా లో డాన్స్ షో వస్తే ఢీ ని చూసే వారు మరింతగా తగ్గుతారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి