
airline company run by Anasuya
Anasuya : యాంకర్ అనసూయ ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుందని టాక్. ఒకప్పుడు అన్నివిషయాల్లో అడ్జస్ట్‌మెంట్ అయిన ఆమె.. ఈ మధ్య ప్రతి విషయాన్ని రచ్చ రచ్చ చేస్తుందని.. బహుశా దీనికి కారణం తనకు తాను స్టార్ హీరోయిన్ అని ఫీల్ అవ్వడమే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తోంది. అనసూయ ఓ పని మీద బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. ఆ సమయంలో తన ఫ్యామిలీ కూడా వెంట ఉంది.
వీరు ప్రయాణించాల్సిన ఎయిర్ లైన్స్ సంస్థ వారు ఫ్లైట్ రన్ వే మీద నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందని ఫైనల్ కాల్ అనౌన్స్ చేశారు. దీంతో అనసూయ తన కుటుంబంతో సహా పరిగెత్తాల్సి వచ్చింది. తీరా వెళ్లాక ఫ్లైట్ aబయలు దేరలేదు కదా వాళ్లు కంగారు పడి మమ్మల్ని ఆగం చేశారని వాపోయింది. విమాన సిబ్బంది వలన అనసూయ ఎదుర్కొన్న ఇబ్బందులను ట్వీట్ రూపంలో తెలియజేసింది. ప్యాసింజర్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎయిర్ లైన్స్ సంస్థకు సూచిస్తూ చాలా స్ట్రాంగ్ మెసేజ్ రాసి పోస్టు చేయడంతో అదికాస్త వైరల్ అవుతోంది. ‘అలయన్స్ ఎయిర్ 9I 517 ప్లైట్ ప్రొటోకాల్‌తో చాలా సిక్ అయ్యాను.
airline company run by Anasuya
బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు మమ్మల్ని పరుగులు పెట్టించారు. లాస్ట్ కాల్ 6.20 గంటలకు అని అనౌన్స్ చేశారు. కానీ బోర్డింగ్ టైమ్ 18.55 అని టికెట్‌లో మెన్షన్ చేశారు. టేకాఫ్ టైమ్ 19.25 గంటలు. బస్సులో మేం అరగంట వెయిట్ చేశాం.విమానం ఆగి ఉండగానే మా పిల్లలతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. తీరా వెళ్లాక మాస్క్ కావాలన్నారు.మరల వాళ్లే అవసరం లేదన్నారు.అంత కన్‌ఫ్యూజన్ ఎందుకు. విమానం ఎక్కాక సీట్స్ ఎక్కడెక్కడో ఇచ్చారు. ఆ కంగారులో సీటుకు తగిలి నా షర్ట్ చిరిగిపోయింది. ప్రయాణీకులకు చెప్పే ముందు మీరు సరిగ్గా వారితో వ్యవహరించండి’ అంటూ అనసూయ ఫైర్ అయ్యింది. కాగా, ఈ యాంకరమ్మ ట్వీట్‌కు వారు రియాక్ట్ అవుతారో లేదో వేచిచూడాల్సిందే.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.