Allu Aravind : అన్ స్టాపబుల్ షో గురించి తెలుసు కదా. ఆహా ఓటీటీలో వస్తున్న ఈ షో సూపర్ సక్సెస్ అయింది. తొలి సీజన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ ను కూడా వెంటనే స్టార్ట్ చేశారు. ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో బాలయ్య బాబు దూసుకొచ్చారు. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కూడా ప్రసారం అయింది. రెండో ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. అయితే.. మొదటి సీజన్ లో మాత్రం ఆహా ఓటీటీ యాజమాన్యం సెలబ్రిటీలను పిలవగా.. రెండో సీజన్ లో మాత్రం ఏకంగా హోస్ట్ బాలయ్యకు నచ్చిన గెస్టులను తీసుకొస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బాబు బావ, అల్లుడు చంద్రబాబు, నారా లోకేశ్ మొదటి ఎపిసోడ్ లో వచ్చిన విషయం తెలిసిందే.
రెండో ఎపిసోడ్ లో డీజే టిల్లు ఫేమ్ సిద్దు, విశ్వక్సేన్ ను పిలిచాడు బాలయ్య. మరి.. తనతో పాటు సమానమైన హీరో, తనతో పోటీ పడి మరీ సినిమాలు చేసే అక్కినేని నాగార్జునను మాత్రం ఇప్పటి వరకు బాలయ్య బాబు పిలవలేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చారు. విక్టరీ వెంకటేశ్ కూడా రానున్నారు. కానీ.. అక్కినేని నాగార్జున గురించి మాత్రం ఏ అప్ డేట్ లేదు. అసలే బాలయ్య బాబు గురించి తెలుసు కదా. ఆయన షోకు వచ్చాక ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే. పర్సనల్ విషయాలను కూడా తిన్నగా లాగుతారు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే.. గెస్ట్ ఎంతటి వారు అయినా దబిడి దిబిడే. అందులోనూ నాగార్జున కొడుకు, కోడలు విడిపోయారు.
వాటి గురించి ప్రశ్నలు ఎక్కడ అడుగుతారో అని అందుకే ఈ షోకు దూరంగా ఉండటమే బెటర్ అని నాగార్జున అనుకున్నారో ఏమో అని నాగ్ అనుకున్నట్టు తెలుస్తోంది. అందులోనూ నాగార్జున నటించిన సినిమాలు కూడా ఇటీవల వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఎందుకు లేనిపోని గొడవ అని నాగ్.. అన్ స్టాపబుల్ షోకు రాకుండా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైవు నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6 కు హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఒక షోకు హోస్ట్ గా ఉంటూ మరో షోకు గెస్ట్ గా ఇప్పుడు వెళ్లడం కరెక్ట్ కాదని అనుకున్నారో ఏమో.. అందుకే నాగార్జున మాత్రం బాలయ్య రిక్వెస్ట్ చేసినా ఏ విషయం ఇప్పటి వరకు చెప్పలేదట. చూద్దాం మరి భవిష్యత్తులో అయినా బాలయ్య బాబు షోకు నాగార్జున వెళ్తారో లేదో.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.