
Akhil Sarthak Back To Back Punches on Hyper Aadi
Hyper Aadi : బుల్లితెరపై ఆది డామినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అతనే అందరి మీద పంచులు వేస్తుంటాడు. అతని మీద పంచులు వేసేందుకు ఎవ్వరూ సాహసం చేయరు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసేది ఆదియే కాబట్టి. ఆది తనకు అనుకూలంగా స్క్రిప్ట్ రాస్తుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అతను కాస్త తగ్గుతాడు. వేరే వాళ్లకు చాన్స్ ఇస్తాడు. ఉదాహరణకు నిహారిక లాంటి వాళ్లు గెస్టులుగా వస్తే.. వారికే చాన్స్ ఇస్తాడు. తన మీద పంచులు వేసేలా స్క్రిప్ట్ రాస్తుంటాడు. అలా పదే పదే ఆది పంచులు వేయడమే కాకుండా.. ఆది మీద కూడా పంచులు పడుతుంటే జనాలు ఎంజాయ్ చేస్తుంటారు.
ఆ విషయం ఆదికి కూడా బాగా తెలుసు. అందుకే అప్పుడప్పుడు ఆది కాస్త వెనక్కి తగ్గుతాడు. తన మీద తానే సెటైర్లు రాసుకుంటాడు. వేయించుకుంటాడు. ఇక ఇప్పుడు ఢీ షోకు సంబంధించిన ప్రోమోలో ఆది మీద వరుసగా పంచులు పడ్డాయి. అది కూడా అఖిల్ వేయడం అందరికీ వింతే. ఎందుకంటే అఖిల్ వచ్చిన ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా పంచులు వేయలేదు. పంచ్‌లు వేయించుకున్నాడంతే. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలో అఖిల్ అదరగొట్టేశాడు. ఆదికి ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా కౌంటర్లు వేశాడు. పావనితో ఏదో చాలెంజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.
Akhil Sarthak Back To Back Punches on Hyper Aadi
నీకు దమ్ముందా? అని ఆదిని పావని అడుగుతుంది. ఆ మెట్లు ఎక్కి వస్తేనే దమ్ము తీస్తాడు.. ఇంకా దమ్ముందా? అని అడుగుతున్నావా? అని ఆది పరువుతీస్తాడు అఖిల్. ఆ తరువాత వెంటనే ఇంకో పంచ్ వేస్తాడు అఖిల్. రెండు మీద ఒకటి కదా? ఉండేది అని అఖిల్ అంటాడు. మరి నువ్ ఎవరి మీదున్నావ్ అని ఆది కౌంటర్ వేయబోతాడు. నేను సోఫా మీదున్న అది కూడా కనిపించడం లేదా? అని ఇంకో పంచ్ వేస్తాడు అఖిల్. అలా ఆదికి వరుసగా పంచులు పడుతుంటాయి ఇందులో. అయితే చాలా రోజుల తరువాత అఖిల్‌కు ఆది చాన్స్ ఇచ్చినట్టున్నాడు.
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…
PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…
This website uses cookies.