Hyper Aadi : అఖిల్ కూడా ఎదిగిపోయాడు.. హైపర్ ఆది మీదే సెటైర్లు

 Authored By prabhas | The Telugu News | Updated on :27 August 2022,1:00 pm

Hyper Aadi : బుల్లితెరపై ఆది డామినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అతనే అందరి మీద పంచులు వేస్తుంటాడు. అతని మీద పంచులు వేసేందుకు ఎవ్వరూ సాహసం చేయరు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసేది ఆదియే కాబట్టి. ఆది తనకు అనుకూలంగా స్క్రిప్ట్ రాస్తుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అతను కాస్త తగ్గుతాడు. వేరే వాళ్లకు చాన్స్ ఇస్తాడు. ఉదాహరణకు నిహారిక లాంటి వాళ్లు గెస్టులుగా వస్తే.. వారికే చాన్స్ ఇస్తాడు. తన మీద పంచులు వేసేలా స్క్రిప్ట్ రాస్తుంటాడు. అలా పదే పదే ఆది పంచులు వేయడమే కాకుండా.. ఆది మీద కూడా పంచులు పడుతుంటే జనాలు ఎంజాయ్ చేస్తుంటారు.

ఆ విషయం ఆదికి కూడా బాగా తెలుసు. అందుకే అప్పుడప్పుడు ఆది కాస్త వెనక్కి తగ్గుతాడు. తన మీద తానే సెటైర్లు రాసుకుంటాడు. వేయించుకుంటాడు. ఇక ఇప్పుడు ఢీ షోకు సంబంధించిన ప్రోమోలో ఆది మీద వరుసగా పంచులు పడ్డాయి. అది కూడా అఖిల్ వేయడం అందరికీ వింతే. ఎందుకంటే అఖిల్ వచ్చిన ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా పంచులు వేయలేదు. పంచ్‌లు వేయించుకున్నాడంతే. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలో అఖిల్ అదరగొట్టేశాడు. ఆదికి ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా కౌంటర్లు వేశాడు. పావనితో ఏదో చాలెంజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Akhil Sarthak Back To Back Punches on Hyper Aadi

Akhil Sarthak Back To Back Punches on Hyper Aadi

నీకు దమ్ముందా? అని ఆదిని పావని అడుగుతుంది. ఆ మెట్లు ఎక్కి వస్తేనే దమ్ము తీస్తాడు.. ఇంకా దమ్ముందా? అని అడుగుతున్నావా? అని ఆది పరువుతీస్తాడు అఖిల్. ఆ తరువాత వెంటనే ఇంకో పంచ్ వేస్తాడు అఖిల్. రెండు మీద ఒకటి కదా? ఉండేది అని అఖిల్ అంటాడు. మరి నువ్ ఎవరి మీదున్నావ్ అని ఆది కౌంటర్ వేయబోతాడు. నేను సోఫా మీదున్న అది కూడా కనిపించడం లేదా? అని ఇంకో పంచ్ వేస్తాడు అఖిల్. అలా ఆదికి వరుసగా పంచులు పడుతుంటాయి ఇందులో. అయితే చాలా రోజుల తరువాత అఖిల్‌కు ఆది చాన్స్ ఇచ్చినట్టున్నాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి