
Akkineni Akhil is in troubles
Akkineni Akhil : అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో తన సత్తా చూపించుకునేందుకు తహతహలాడుతున్నాడు. కెరీర్‌లో విభిన్న కథా చిత్రాలు చేస్తున్నా కూడా సరైన హిట్ దక్కకపోవడంతో చాలా నీరసించి పోయారు. ఈ సారి ఎలా అయిన పెద్ద హిట్ కొట్టాలని ఏజెంట్ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే రు. 80 కోట్ల బడ్జెట్ అయ్యిందంటున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. గత ఆరేడు నెలల నుంచి రిలీజ్ అంటున్నా వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. ప్రస్తుతానికి కూడా మేకర్స్ నుంచి అయితే రిలీజ్ కి సంబంధించి ఏం మాట్లాడడం లేదు.
దీంతో సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. నాగార్జున అయిన కొడుకు విషయంలో కాస్త కల్పించుకొని కెరీర్ ఎదుగుదలకు కృషి చేయాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఏజెంట్ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని అంటున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Akkineni Akhil is in troubles
ఈ సినిమా కేవలం ఆంధ్ర ఏరియాలోనే దాదాపు 30 కోట్ల బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 55 నుంచి 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని, ఈ సినిమా హక్కుల కోసం పలు బిగ్గెస్ట్ కంపెనీలు పోటీ పడుతున్నాయని అంటున్నారు. కాగా, బాలనటుడిగా సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక హీరోగా అఖిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు ఏజెంట్ అంటూ ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.