Home » Entertainment » Akkineni Hero Going To Marry That Heroine
Entertainment

Akkineni : ఆ స్టారో హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని హీరో..!

Authored By
aruna
The Telugu News | Updated on: May 2, 2025 5:56 pm
Advertisement

Akkineni : ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల ప్రేమ వ్య‌వ‌హారాలు ఏ మాత్రం అంతుబ‌ట్టడం లేదు. ఎవ‌రు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ‌తారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే ఇప్పుడు అక్కినేని హీరో ఓ స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడ‌నే వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప్రేమకథ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సుమంత్ అక్కినేని.

Advertisement

Akkineni : ఆ స్టారో హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని హీరో..!

Akkineni ఆమెతో ప్రేమ‌..

తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, స్నేహమంటే ఇదేరా, సత్యం, గౌరీ, ధన 51, మహానంది, గోదావరి, మధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్ వంటి చిత్రాలతో సత్తా చాటారు. అయితే ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన కెరీర్‌లో డౌన్‌ఫాల్ అయ్యింది. అయితే తొలి ప్రేమ ఫేమ్ హీరోయిన్ కీర్తి రెడ్డితో ప్రేమలో పడ్డ సుమంత్ పెద్దల అంగీకారంతో ఆమెను 2004లో పెళ్లాడారు. కొన్నాళ్లు సాఫీగానే సాగినప్పటికీ తర్వాత వీరి బంధం బీటలు వారింది. రెండేళ్లు తిరిగేసరికి 2006లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.

Advertisement

నాటి నుంచి ఒంటరిగానే ఉంటున్న సుమంత్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారని , ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సుమంత్‌తో పీకల్లోతు ప్రేమలో స్టార్ హీరోయిన్ ముంబైకు చెందిన ఈ నటి.. రెండేళ్ల క్రితం ఓ స్టార్ హీరో కొడుకుతో చేసిన ప్రేమకథతో టాలీవుడ్‌లో జెండా పాతారు. ఈ దెబ్బతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. సుమంత్‌తో సదరు హీరోయిన్‌ క్లోజ్‌గా ఉంటోందని ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి