Ali Reza starts Journey From Nagarjuna Boss Movie
బిగ్ బాస్ షోకి రాకముందు అలీ రెజా అంటే చాలా మందికి తెలియదు. బుల్లితెరపై సీరియల్స్‌లో నటిస్తాడని కొంత మందికి తెలుసు. కానీ అదే అలీ రెజా ధృవ సినిమాలో రామ్ చరణ్ ఫ్రెండ్, పోలీస్ ఆఫీసర్ పాత్రను వేశాడని ఎవ్వరికీ తెలియదు. బిగ్ బాస్ షోలోకి వెళ్లాకే ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో మాత్రం అలీకి మంచి పేరు తెచ్చింది. హ్యూమన్ బుల్డోజర్, అర్జున్ రెడ్డి అంటూ ఇలా అతనికి ఉన్న కోపంపై రకరకాల పేర్లు పెట్టారు.
Ali Reza starts Journey From Nagarjuna Boss Movie
మొత్తానికి బయటకు వచ్చిన తరువాత అలీ రెజా ఫాలోయింగ్ పెరిగింది. అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఏకంగా నాగార్జున పక్కనేనటించే చాన్స్ కొట్టేశాడు. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో ఓ ఆఫీసర్‌గా అలీ రెజా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మనాలీలో షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. తాజాగా ఈ మూవీ గురించి అలీ రెజా మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టేశాడు. నాగార్జున బాస్ సినిమాలో అలీ రెజా నటించాడట. ఇదే విషయాన్ని చెబుతూ తన ప్రయాణం గురించి తెలిపాడు.
వైల్డ్ డాగ్ గురించి షూటింగ్ చేసిన ప్రతీ నిమిషాన్ని నేను ప్రేమించాను.. కింగ్ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోవడమనేది నా కల నెరవేరడం లాంటింది.. బాస్ (2006) మూవీ నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌గా నా సినీ ప్రయాణం మొదలైంది. అలా మొదలైన ప్రయాణం ఇలా వైల్డ్ డాగ్ సినిమాలో అతి ముఖ్యమైన పాత్రను పోషించే వరకు వచ్చింది. ఇలా రావడానికి నాకు 14 ఏళ్లు పట్టింది. కానీ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నడూ కూడా నేను వదిలేయలేదు.. దానికి బదులు రెట్టించి కష్టపడ్డాను.. నా కలను సాకారం చేసుకున్నాను.. బిగ్ బాస్ ఇంటి నుంచి ఇక్కడి వరకు తీసుకువచ్చిన నాగార్జున గారికి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదంటూ సినిమా త్వరలోనే విడుదల కాబోతోందని తెలిపాడు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.