Home » Entertainment » Allu Aravind Interesting Comments About Mega Family Clashes
Entertainment

Allu Aravind : మెగా ఫ్యామిలీలో విభేదాల గురించి అల్లు అరవింద్ షాకింగ్ వ్యాఖ్యలు

Authored By
aruna
The Telugu News | Published on: August 26, 2022, 8:00 pm
Advertisement

Allu Aravind : మెగా ఫ్యామిలీ లో గత కొన్నాళ్లుగా విభేదాల గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ లో విభేదాలు అనేవి ఉన్నాయి.. కానీ అవి నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి కుటుంబంకు మరియు అల్లు అరవింద్ కుటుంబంకు మధ్య విభేదాలు అనేవి తీవ్రంగా ఉన్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయం లో ఇప్పటి వరకు అధికారికంగా బయటకు రాలేదు. కానీ మెగా కాంపౌండ్ కు చెందిన వారు అనధికారికంగా చెబుతూ ఉంటారు. అందుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా వారు మీడియా కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

మీడియాలో మెగా ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి ఎప్పుడు వార్తలు వచ్చినా కూడా కొందరు కొట్టి పారేస్తూ వస్తున్నారు. తాజాగా అల్లు అరవింద్‌ మీడియా ముందుకు వచ్చి మరీ మెగా ఫ్యామిలీ లో ఉన్న విభేదాలు కేవలం మీడియా సృష్టే అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు మెగా ఫ్యామిలీ మధ్య గొడవలకు ఆస్కారం ఎక్కడ ఉంది అన్నట్లుగా ప్రశ్నించాడు. ఇటీవల చిరంజీవి బర్త్‌ డే వేడుకల్లో కేవలం అల్లు బాబీ మాత్రమే పాల్గొనడం వల్ల ఆ పుకార్లు మరింతగా పెరిగాయి. కానీ ఎవరికి ఉండే కారణాలు వారికి ఉన్నాయి. చిరంజీవి బర్త్‌ డే కు అల్లు వారు వెళ్లక పోవడం వెనుక బ్రహ్మ రహస్యం లేదని కొందరు అంటున్నారు.

Allu Aravind interesting comments about mega family clashes

Advertisement

అల్లు అరవింద్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ లో అందరు సక్యతతో ఉంటారు. అయితే అప్పుడప్పుడు కలిసిన సందర్భాల్లో అందరు కలవడం అనేది కాస్త ఇబ్బందికర విషయం. ఎవరికి వీలు ఉన్నప్పుడు వారు కలుస్తారు. అంతే తప్ప కల్పించుకోవాలంటే కాస్త కష్టమే అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా అల్లు బ్రదర్స్ మధ్య విభేదాల గురించి కూడా అల్లు అరవింద్‌ స్పందించాడు. అలాంటిది అసలు ఏమీ లేదని.. ముగ్గుర మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. మీడియా లేనిపోని పుకార్లు పుట్టించవద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి