allu aravind stunning comments
Allu Aravind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. ఆయన ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. అందుకు కారణం ఆయన తెలుగులో రిలీజ్ చేసిన కాంతార సినిమా భారీ వసూళ్లు సాధిస్తుండడమే. మరో వైపు అల్లు అరవింద్ ఆహాలోరన్ అవుతున్న అన్‌స్టాపబుల్ 2కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడం. అయితే అల్లు అరవింద్ రీసెంట్‌గా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై అనేక విషయాలు పంచుకున్నారు. అల్లు రామలింగయ్యతో ముడిపడి ఉన్నవే ఆయన ఎక్కువ పంచుకోవడం విశేషం. ‘నాన్న గారికి కోపం వస్తుందా?’ అని ఆలీ అడిగిన ప్రశ్నకు అల్లు అరవింద్ స్పందిస్తూ.. ‘‘ఆయన చాలా సీరియస్ మనిషి, హాస్యాన్ని తెర మీద పంచుతారు కానీ..రియల్ లైఫ్‌లో మాత్రం సీరియస్‌నెస్సే పంచారు’’ అని అన్నారు.
పెద్దయిన తరవాత, పిల్లలు పుట్టిన తరవాత కూడా మీకు సన్మానం జరిగిందని విన్నాను. అది ఏ సందర్భంలో సార్’’ అని ఆలీ ప్రశ్నించగా, దానికి అల్లు అరవింద్ నవ్వారు .. ఈ ప్రశ్నను అల్లు అరవింద్ భార్య నిర్మల.. ఆలీని అడగమని ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారట. దాంతో అరవింద్ సమాధానం ఇస్తూ.. ‘‘మా అమ్మ గారితో ఆయనకి ఏదో తగువు అవుతోంది. జనరల్‌గా వారిద్దరి మధ్య తగువు డ్రింక్ విషయంలో అవుతుంటుంది. ఏం తగువు అవుతుందో నాకు తెలీదు కానీ ఆయన అరుపులు నాకు మేడపైకి వినబడుతున్నాయి. నేను కిందకు వచ్చే సరికి నాతో దెబ్బలాడి ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. కారు తీసుకొని వెనకనుంచి వెళ్లాను. కారు ఎక్కమని అంటే మీ అమ్మతో మాట్లాడను అని అరుస్తున్నారు. మీరు ముందు లోపలికి ఎక్కండి అన్నాను. ఎక్కారు. ఈయన రోడ్డెక్కేశాడని నాకు చాలా కోపంగా ఉంది.
allu aravind stunning comments
గేటు లోపలికి వెళ్లిన తరవాత ఆ కోపంలో బ్రేక్ గట్టిగా తొక్కేశా. నిజానికి నేను కావాలని వేయలేదు. అయితే గట్టిగా బ్రేక్ వేసేసరికి ఈయన వెళ్లి విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారు. వెంటనే ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది వెధవ అని అన్నారు . అయితే ఆయనే నేర్పిన విషయం మరచిపోయారు. ఇక రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్య బెడ్‌రూంలోకి వెళ్లాను. ‘ఏవండీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను.. ఎందుకు మిమ్మల్ని మావయ్యగారు అలా కొట్టారు’ అని నా భార్య అంది. నువ్వెక్కడి నుంచి చూశావు అంటే.. నేను పైన వరండాలో ఉన్నాను, మిమ్మల్ని కొట్టగానే లోపలికి పారిపోయాను అంది. అబ్బా.. దీన్ని రభస చేసి రచ్చ చేయాల్సింది.. ఈవిడకి తెలుస్తుంది అనే కదా లోపలే దాచేశాను అనుకున్నాను’’ అని అల్లు అరవింద్ వివరించారు. అయితే ఆ దెబ్బ ఇప్పటికీ తనకు స్వీట్ మెమోరీ అని చెప్పుకొచ్చారు.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
This website uses cookies.