Chinmayi : సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది చిన్మయి. మీటూ ఉద్యమం నుండి చిన్మయి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అమ్మాయిల తరపున తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. సమస్య చెప్పుకున్న ఆడపిల్లకు ధైర్యమిస్తుంది. ఇక డైరెక్టర్ కమ్ హీరో రాహుల్.. చిన్మయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కొద్ది నెలల క్రితం కవలపిల్లలు జన్మించినట్లు ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అందుకు కారణం ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫోటోస్ ఒక్కటి కూడా నెట్టింట షేర్ చేయకుండానే ఆమె తల్లి అయిందనే సరికి సరోగసి ద్వారా జన్మనిచ్చి ఉంటుందని భావించారు.
ఈ క్రమంలో చిన్మయిని తెగ ట్రోల్ చేశారు. అయిన లైట్ తీసుకుంది. దీంతో కొంత సద్దుమణిగింది.ఇక నయన్.. విఘ్నేష్ దంపతులు సరోగసి పద్దతితో పిల్లలకు జన్మనివ్వడంతో మళ్లీ చిన్మయి పై రూమర్స్ గుప్పుమన్నాయి. ఈ క్రమంలో చిన్మయి తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. చిన్మయి తన కవల పిల్లలకు పాలు పడుతున్న ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో ఇద్దరికీ ఒకేసారి పాలిస్తూ కనిపిస్తోంది. పిల్లలు ఫీడింగ్ చేయడం ఇలా ఉంటుంది.. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. భుజాలు భిన్నమైన స్వరాన్ని కలిగి ఉంటాయి అని చిన్మయి ఈ పోస్టులో రాసుకొచ్చింది.
ఇక నేను గర్భవతిగా ఉన్న ఫోటోలను షేర్ చేయకపోవడంతో అందరూ సరోగసి ద్వారా నాకు కవలలు పుట్టారా అని నాకు మేసేజ్ చేస్తున్నారు. వారు అనుకోవడంలో తప్పు లేదు. అది వారి అభిప్రాయం. కానీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్నాను. నా పిల్లల ముఖాలను కూడా నేను చూపించను. నా స్నేహితులు.. కుటుంబం గురించి నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను. మా పిల్లల ఫోటోస్ సోషల్ మీడియాలో ఉండవు అంటూ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది చిన్మయి. ఇకపోతే చిన్మయి తెలుగు తమిళ భాషల్లో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో చిన్మయి తన భర్త రాహుల్ తో కలిసి తొలిసారిగా వెండితెర మీద తళుక్కుమంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.