Home » Entertainment » Allu Arjun About Unveiling Allu Arjun Stutue By Chiranjeevi In Rajahmundry
Entertainment

Allu Arjun : చిరంజీవిపై ట్వీట్.. అల్లు అర్జున్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్స్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 2, 2021, 8:15 am
Advertisement

Allu Arjun అల్లు అర్జున్ Allu Arjun వ్యవహారం ఎప్పుడూ ఎవ్వరికీ అర్థం కాదు. ఒకప్పుడు మెగా హీరోగా పిలిపించుకునే బన్నీ ఇప్పుడు ఆ పదానికి ఆమడ దూరంలో ఉంటున్నాడు. మొత్తం అల్లు బ్రాండ్ మీద అన్నీ కూడా కానిచ్చేయాలని చూస్తున్నాడు. అల్లు స్టూడియోస్ కూడా నిర్మిస్తున్నాడు. అలా మొత్తానికి అల్లు అనే బ్రాండ్‌ను ఇండస్ట్రీలోనూ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే భావనలో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే మెగా హీరోలతో బన్నీ కాస్త దూరం మెయింటైన్ చేస్తున్నాడనిపిస్తోంది.

Advertisement

Allu ARjun About unveiling Allu Arjun Stutue By Chiranjeevi in Rajahmundry

శుక్రవారం అల్లు రామలింగయ్య శత జయంతి. ఈ క్రమంలో రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. తన మామతో ఉన్న అనుబంధాన్ని చిరు పంచుకున్నారు. ఇక అల్లు స్టూడియోలో రామలింగయ్య విగ్రహాన్ని అల్లు వారసులు ఆవిష్కరించారు. అయితే తన తాత విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించడం, మాట్లాడిన మాటలపై బన్నీ స్పందించాడు. ఈ మేరకు చిరంజీవికి థ్యాంక్స్ చెబుతూ వేసిన ట్వీట్‌పై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

Advertisement

Allu ARjun About unveiling Allu Arjun Stutue By Chiranjeevi in Rajahmundry

Allu Arjun అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

రాజమండ్రిలో మా తాత అల్లు రామలింగయ్య గారి విగ్రహాన్ని చిరంజీవి గారు ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. మా తాత గురించి ఎంతో గొప్పగా చెప్పడం నా హృదయాన్ని కదిలించింది. నేను, నా ఫ్యామిలీ ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని బన్నీ ట్వీట్ వేశాడు. ఇలా చిరంజీవి పరాయివాడిలా భావించినట్టు ఆ ట్వీట్ గోచరిస్తోందని, బన్నీని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇప్పటికే మూడు ట్వీట్లు వేశావ్.. వెళ్లి రెస్ట్ తీసుకో.. పడుకో అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Advertisement

Allu ARjun About unveiling Allu Arjun Stutue By Chiranjeevi in Rajahmundry

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి