Allu Arjun and Allu Shirish quarrel.. This is the evidence
Allu Arjun : అల్లు ఫ్యామిలీలో విభేదాలు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికి రెండు మూడు సార్లు అల్లు అరవింద్ మరియు కుటుంబ సన్నిహితులు ఆ వార్తలను కొట్టి పారేశారు. అయినా కూడా ఆ వార్తలు నిజమే అన్నట్లుగా కొందరు సాక్షాధారాలను కూడా సమర్పిస్తున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన సినిమా ఊర్వశివో రాక్షసివో విడుదల తేదీని ప్రకటించాడు. సినిమా విడుదల తేదీకి అల్లు వారి కుటుంబంలో విభేదాలకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే నవంబర్ 4వ తారీఖున సమంత హీరోయిన్ గా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అల్లు శిరీష్ తన సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించాడు. అదే నాలుగవ తారీఖున అల్లు శిరీష్ తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కచ్చితంగా పోటీ ఉంటుంది అనడంలో సందేహం లేదు. శాకుంతలం సినిమాకి మంచి బజ్ ఉన్నా కూడా అల్లు శిరీష్ సినిమా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు అల్లు శిరీష్ సినిమా విడుదలకు శాకుంతలం సినిమా విడుదలకు అల్లు వారి గొడవలకు సంబంధం ఏంటా అని చూస్తున్నారా.. ఆ విషయానికి వస్తే శాకుంతలం సినిమా లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించిన విషయం తెలిసిందే. తన అన్న కూతురు నటించిన సినిమా సోలోగా విడుదల కాకుండా అల్లు శిరీష్ తన సినిమాను విడుదల చేస్తున్నాడు. అందువల్లే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు తారా స్థాయిలో ఉన్నాయి అని.. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇదే అంటూ కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Allu Arjun and Allu Shirish quarrel.. This is the evidence
కాస్త లోతుగా ఆలోచిస్తే నిజమేనేమో అన్నట్లుగా ఆ సాక్ష్యం అనిపిస్తుంది. ఎన్నో విడుదల తేదీలను వదిలి పెట్టి.. ఇన్నాళ్లు తన సినిమా ను వాయిదా వేసి శాకుంతలం సినిమా విడుదల తేదీలోనే అల్లు శిరీష్ రావాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు అల్లు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా అల్లు అర్జున్ కి కౌంటర్ అన్నట్లుగానే భావించవచ్చు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ కారణాల వల్లనే అల్లుడు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని బలంగా వాదన వినిపిస్తుంది. మరో సారి మెగా ఫ్యామిలీ నుండి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక కూతురు అల్లు అర్హ సినిమాకు తాను పోటీగా రావడానికి గల కారణమేంటి అనేది అల్లు శిరీష్ వివరిస్తాడేమో చూడాలి.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.