
Allu Arjun : మళ్లీ మంట రాజేసిన అల్లు అర్జున్.. అసలు బన్నీకి పవన్ ఎలా బాబాయ్ అవుతాడు.!
Allu Arjun : మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గొడవ ఎంత అగ్గి రాజేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వారెలా ఉన్నారో తెలియదు కాని అభిమానులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే మెగా బ్రాండ్ వదిలి సొంతంగా అల్లు ఆర్మీని సిద్ధం చేసుకుంటూ.. మెగాభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లడం, అక్కడ ఆయన చేసిన కామెంట్స్.. అల్లు అర్జున్‌ని పూర్తిగా మెగా బ్రాండ్‌కి దూరం చేశాయి. ఒకవైపు తన ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ పోటీలో ఉండగా.. ఆయన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడంపై అనేకానేక మాటలను బన్నీ ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ మధ్య ఓ మూవీ ఫంక్షన్‌లో మెగాభిమానులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అడగగా.. ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ ఫ్యాన్స్‌కి క్లాస్ ఇచ్చాడు.
Allu Arjun : మళ్లీ మంట రాజేసిన అల్లు అర్జున్.. అసలు బన్నీకి పవన్ ఎలా బాబాయ్ అవుతాడు.!
అప్పటి నుండి అల్లు అర్జున్‌లో ఛేంజ్ కనిపిస్తూ వస్తుంది. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్, మెగా బ్రాండ్‌ని.. మెగాభిమానులని బాధపెడితేనే తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పడుతుందని భావించినట్లుగా ఉన్నాడు. తను అంత చేసినా సినిమా టిక్కెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం చూసి కరిగిపోయాడో తెలియదు కానీ.. ఫైనల్లీ అల్లు అర్జున్ మారిపోయారు. ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్ మీట్‌లో కళ్యాణ్ బాబాయ్ అంటూ.. మరోసారి పాత అల్లు అర్జున్‌ని గుర్తు చేశారు. ‘‘టిక్కెట్ల ధరలను పెంచుకునేలా జీవో రావడానికి ప్రధానకారణమైన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్యూ. నా వ్యక్తిగతంగా కూడా కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్యూ. హార్ట్‌ని టచ్ చేశారు..’’ అని అల్లు అర్జున్ ఈ వేడుకలో చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ అక్కడితో ఆగకుండా “ఆన్ ఏ పర్సనల్ నోట్” అంటూ “పవన్ కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ వెరీ మచ్” అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. దీంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి బాబాయ్ ఎప్పుడు అయ్యారు..? ఆయన వరుసకు మామయ్య కదా అవుతారు? అని సినీ జనులంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. నష్ట నివారణ కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాడని ,అంతేతప్ప తన మేనమామలను దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్లు చేయలేదని స్పష్టంగా తేటతెల్లమైందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బన్నీ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కళ్యాణ్ బాబాయి అని ప్రస్తావించడంతో బంధాలను కూడా మరిచిపోయాడా అంటూ ఫైర్ అవుతున్నారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.