Pushpa 2 : మళ్లీ నేషనల్ అవార్డ్ టార్గెట్ తోనే పుష్ప 2..? ఎంత మోసం..?
ప్రధానాంశాలు:
Pushpa 2 : మళ్లీ నేషనల్ అవార్డ్ టార్గెట్ తోనే పుష్ప 2..? ఎంత మోసం..?
Pushpa 2 : పుష్ప 2 సినిమా చూసిన వాళ్లంతా అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఆహా ఓహో అనేస్తున్నారు. ఐతే ఆర్య సినిమా నుంచి సుకుమార్ సినిమాలు చూస్తూ ఆయన ఫ్యాన్స్ గా మారిన ఆడియన్స్ మాత్రం పుష్ప 2 లో సుకుమార్ మార్క్ కనిపించలేదని చెప్పేస్తున్నారు. పుష్ప 2 కథ ఎందుకు అలా చేశాడు అంటూ సుకుమార్ గురించి పెద్ద రేంజ్ లో చర్చ జరుగుతుంది. ఐతే పుష్ప 2 సినిమా లో సుకుమార్, అల్లు అర్జున్ వేసిన సూపర్ ప్లాన్ రివీల్ అయ్యింది. పుష్ప 1 సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 పై సూపర్ బజ్ ఏర్పడింది. ఐతే పుష్ప 1 సినిమాకు అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది.
Pushpa 2 ప్రీ క్లైమాక్స్ ఫైట్ గురించి..
పుష్ప 2 సినిమా లో కూడా అదే టార్గెట్ తో వచ్చారు. అసలైతే పుష్ప కథను పార్ట్ 2 లో ముగించాల్సి ఉన్నా కూడా పుష్ప 2 లో కూడా నేషనల్ అవార్డ్ టార్గెట్ తోనే కొన్ని సీన్స్ పెట్టి కథ ఏమి లేకుండా నడిపించాడు సుకుమార్. సినిమా చూసిన వాళ్లంతా కూడా జాతర ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఐతే ఈ ఎపిసోడ్స్ లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూస్తే మళ్లీ పక్కా అవార్డ్ విన్నింగ్ అనేట్టుగా ఉంది. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించేలా చేశాడు. సినిమా చూసిన వాళ్లంతా అల్లు అర్జున్ నటన గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు అంటే ఆ క్రెడిట్ అంతా అతనికి దక్కుతుంది.
సుకుమార్ మాత్రం పుష్ప 2 విషయంలో తీసుకున్న డేర్ డెసిషన్ కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా కూడా ఎందుకో అతని సినిమాలో ఉండాల్సిన కొన్ని ఎలిమెంట్స్ లేవన్నట్టు అనిపించింది. సో నేషనల్ అవార్డ్ కోసమే పుష్ప 2 ని కథ పెద్దగా లేకుండా చేశాడంటే సుకుమార్ ఆడియన్స్ ని మోసం చేసినట్టే అని చెప్పొచ్చు. Allu Arjun, Pushpa 2, National Award, Sukumar