allu arjun emotional comments on his fans in pushpa pre release event
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’. రెండు పార్ట్స్ గా రాబోతున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్.. ఈ నెల 17వ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఈవెంట్‌లో మెగా అభిమానులు ‘తగ్గేదేలే’ అని నినదిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హార్ట్ ఫుల్ కామెంట్స్ చేశారు.ప్రీ రిలీజ్ వేడుకకు స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్పీచ్‌లో భాగంగా వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టేజీపైన తనదైన బాడీ లాంగ్వేజ్‌తో బన్నీ అలరించారు. ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ చెప్పే అభిమానుల్లో జోష్ నింపారు. ప్రతీ ఒక్కరికి అభిమానులుంటారని, కానీ, తనకు మాత్రం ఆర్మీ ఉందని తాను ఇంతవరకు ఏదైనా సంపాదించుకున్నాను అంటే అది మీ అందరి అభిమానమేనని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారుతనకు అభిమానుల కంటే ఏదీ ఎక్కువ కాదని, వారంటే తనకు చాలా ఇష్టమని చెప్తూ.. ఐలవ్ యూ చెప్పాడు బన్నీ . ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ వేడుకలతో తాను సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్‌ల ను చాలా మిస్ అవుతున్నానని అన్నాడు.
allu arjun emotional comments on his fans in pushpa pre release event
వారిరువురికి థాంక్స్ చెప్పాడు. సినిమాలోని పాటలకు లిరిక్స్ అందించిన చంద్రబోస్‌కు థాంక్స్ చెప్పారు. చంద్రబోస్ రాసే పదాలను విని ప్రతీ ఒక్కరు స్ఫూర్తి పొందుతారని, అంతటి గొప్ప స్థాయి చంద్రబోస్‌ది అని తెలిపారు. ఇక ఈ సినిమా కోసం తాను నాలుగు సినిమాలకు పడినంత కష్టం పడ్డానని, తనతో పాటు మూవీ యూనిట్ కూడా చాలా కష్టపడిందని, ప్రతీ ఒక్క డిపార్ట్‌మెంట్‌కు ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నానని అన్నారు. తాను హీరోయిన్ రష్మికను క్రష్మిక అని పిలుస్తానని, గొప్ప టాలెంట్ ఉన్న నటి రష్మికని ప్రశంసించారు బన్నీ.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.