Janaki Kalaganaledu 13 Dec Today Episode : లడ్డూల ఎఫెక్ట్.. రామాను ఓ ఆట ఆడుకున్న జానకి.. మతి తప్పి ప్రవర్తించిన చికిత, మల్లిక.. ఈ విషయం తెలిసి జ్ఞానాంబ ఏం చేస్తుంది?

Janaki Kalaganaledu 13 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 191 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రజనీ కాంత్.. చికితకు స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్తాడు. ఇంతలో జానకి స్నానం చేసి బయటికి వస్తుంది. ఏంటి చికిత.. ఎవరితో మాట్లాడుతున్నవు అంటుంది. దీంతో స్వీట్ బాక్స్ విషయం చెబుతుంది. పెదబాబు గారు మీకోసమే స్పెషల్ గా తయారు చేశారట. ఇదిగోండి అంటూ స్వీట్ బాక్స్ ఇస్తుంది. అమ్మ గారు నాకు కూడా ఒక లడ్డు ఇవ్వరా అంటుంది. చికిత నువ్వు భలే ఉన్నావు. ఇంత చిన్న విషయానికి అంత మొహమాట పడాలా.. ఇదిగో తీసుకో అంటుంది జానకి. దీంతో స్వీటు తిని.. టేస్ట్ సూపరో సూపర్ అంటుంది చికిత. జానకి కూడా ఒక లడ్డు తీసుకొని తింటుంది. చాలా బాగున్నాయి అని కాస్త ఎక్కువే లడ్డులను లాగించేస్తుంది.

janaki kalaganaledu 13 december 2021 full episode

ఇంతలో రామా.. ఇంటికి వస్తాడు. రూమ్ లోకి వచ్చి చూడగానే.. నెత్తి వీరబోసుకొని కూర్చుంటుంది జానకి. జానకి గారు.. ఏంటి ఇలా కూర్చున్నారు అంటాడు. దీంతో ఎలా కూర్చోవాలి స్వామి అంటుంది. మాట కూడా అదోలా ఉంది ఏంటండి అంటాడు. అయ్యబాబోయ్.. మాట కాదు ప్రవర్తన కూడా అదోల ఉంది ఏంటండి అంటాడు. అదోలా అంటే ఎలా.. అర్థం అయ్యేలా చెప్పండి స్వామీ అంటుంది. మందు తాగిన వాళ్లు ప్రవర్తిస్తారు కదా.. అలా ప్రవర్తిస్తున్నారు అంటాడు రామా. అయ్యో రామచంద్రప్రభు.. మైడియర్ భర్త గారు.. ఫుల్ గా తాగిన వాళ్లు తూలిపోతారు. కానీ.. భార్య ఏం కోరుకుంటుందో అర్థం చేసుకోండి అంటుంది. మీరు మందు తాగినట్టు నటిస్తున్నారు కదా అంటాడు రామా. మీరు ఇంత అమాయకులు అనుకోలేదు నేను. మీ అమాయకత్వం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కాదు కాదు.. బోలెడంత ముద్దొచ్చేస్తున్నారు అంటుంది.

తను ముద్దు పెట్టబోయేసరికి.. పెదాల మీద చేయి అడ్డం పెడతాడు. చేయి తీయి అంటుంది. చెంప మీద ముద్దు పెడుతుంది. దీంతో రామాకు ఏదోలా అవుతుంది. కట్ చేస్తే చికిత ఎక్కడ పోయింది. బజ్జీలు తీసుకురా అని చెప్పి గంట అయింది ఎక్కడికి పోయింది ఇది అని వెతుకుతుంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 13 Dec Today Episode : మల్లిక కూడా ఆ లడ్డూలు తిని మతి తప్పుతుంది

చూస్తే.. బజ్జీలు తెచ్చుకొని తనే తింటూ ఉంటుంది చికిత. అమ్మ బాబోయ్.. నీ సంగతి చెబుతా ఆగు అని కిందికి వస్తుంది మల్లిక. ఒసేయ్ చికిత అంటుంది. ఏం చేస్తున్నావే నువ్వు అంటే. కళ్లు జంప్ అనుకుంటా.. వెళ్లి డాక్టర్ కు చూపించుకో అంటుంది చికిత.

దీంతో కోపం వచ్చి చికితను కొట్టబోతుంది మల్లిక. చేయి పట్టుకొని వెనక్కి అంటుంది. ఇలా కాదని చెప్పి మల్లికను బుట్టలో వేసి ఆ బుట్ట కింద కూర్చుంటుంది చికిత. ఇంతలో విష్ణు వస్తాడు. మల్లికను చూశావా అంటాడు. ఎందుకు బాబు రోజూ ఆమె పోరు. ఈరోజైనా ప్రశాంతంగా వెళ్లి పడుకోండి అంటుంది చికిత.

తర్వాత మల్లికను బయటికి తీసుకొస్తుంది చికిత. చికిత.. ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఏమైంది అంటే లడ్డులను చూపిస్తుంది. ఆ లడ్డులను తను కూడా తింటుంది మల్లిక. కట్ చేస్తే రామా, జానకి సరసాలు ఆడుతూనే ఉంటారు. ఇంతలో రామా అంటూ జ్ఞానాంబ పిలుస్తుంది. ఇప్పుడే వస్తాను అంటూ జానకికి చెబుతాడు. తను అస్సలు వెళ్లనీయదు.

మరోవైపు జ్ఞానాంబ మల్లెపూలు దండగా కడుతుంది. ఇంతలో ఏమైంది అమ్మ పిలిచారు అంటుంది. రామా బుగ్గ మీద జానకి పెట్టిన ముద్దు అలాగే కనిపిస్తుంది. అది చూసి జ్ఞానాంబ, గోవింద రాజు ఇద్దరూ నవ్వకుంటారు. ఈ మల్లెపూలు ఈ భార్యకు ఇవ్వు అంటుంది జ్ఞానాంబ. ఇంతలో రామా గారు త్వరగా రండి అంటుంది జానకి. వెంటనే రామా అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతాడు.

జానకి ఎక్కడుందని చూస్తాడు. మీరు రావడానికి ఇంత సేపు ఎందుకు అయింది అని అంటుంది జానకి. అమ్మ మల్లెపూలు పంపించింది అంటాడు రామా. అవునా.. మల్లెపూల వాసన సూపర్ గా వస్తుంది అంటుంది జానకి. తలలో పెట్టండి అంటుంది జానకి. సరే.. అని జానకి తలలో పెడతాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

45 minutes ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

2 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

3 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

4 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

5 hours ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

6 hours ago

Telangana Jobs : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5 జాబ్ నోటిఫికేష‌న్స్‌

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

7 hours ago

Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?

Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…

8 hours ago