Home » Entertainment » Allu Arjun Fans Angry On Sukumar And His Pushpa 2 Script Work
Entertainment

Pushpa 2 Movie : ఫస్ట్‌ ఈజ్ బెస్ట్‌… పుష్ప 2 ఫలితంపై అప్పుడే అభిమానుల టెన్షన్‌

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 20, 2022, 4:30 pm
Advertisement

Pushpa 2 Movie : కేజీఎఫ్ 2 ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేజీఎఫ్ 1 సినిమా ను చేసిన సమయంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమా యొక్క స్క్రిప్ట్‌ ను రెడీ చేసి ఉంచాడు. కేజీఎఫ్ 1 విడుదల అయిన కొన్ని నెలల గ్యాప్‌ లోనే తాను రెడీ చేసుకుని ఉంచుకున్న స్క్రిప్ట్‌ ను ప్రశాంత్ నీల్ పట్టాలెక్కించాడు. అయితే బాలీవుడ్ రేంజ్ లో కేజీఎఫ్ 2 పై అంచనాలు ఉన్న నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్స్ అయిన సంజయ్ దత్ మరియు రవీనా వంటి వారిని నటింపజేసి భారీతనం తీసుకు వచ్చాడు. కేజీఎఫ్ 1 భారీ హిట్ అయ్యింది కనుక కేజీఎఫ్ 2 లో మార్పులు చేయాలని ప్రశాంత్ నీల్ భావించలేదు.

Advertisement

కాని ఇప్పుడు పుష్ప 2 ను మొత్తం మార్చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ను ఈ ఏడాది ఫిబ్రవరి లో ప్రారంభించాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాలేదు. ఈ ఆరు నెలలుగా స్క్రిప్ట్‌ వర్క్‌ లో బిజీగా ఉన్నారు. కథ ను దర్శకుడు సుకుమార్ మొదటే ఫిక్స్ అయ్యాడు. పుష్ప ను రెండు పార్ట్‌ లుగా చేయాలని మద్య లో అనుకుని స్క్రిప్ట్‌ ను డివైడ్‌ చేశాడు. అంటే పుష్ప 1 తో పాటు పుష్ప 2 స్క్రిప్ట్‌ కూడా ఎప్పుడో పూర్తి అయ్యింది. కాని పుష్ప 1 సినిమా బాలీవుడ్ లో హిట్ అయ్యింది కనుక పుష్ప 2 ను కూడా అక్కడ భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నారు. ఫస్ట్‌ ఈజ్ బెస్ట్‌ అనే ఒక చిన్న ఇంగ్లీష్ సామెత ఉంది. ఫస్ట్ రెడీ అయిన స్క్రిప్ట్‌ బెస్ట్ గా ఉండి ఉంటుంది.

allu arjun fans angry on Sukumar and his Pushpa 2 script work

Advertisement

దాన్ని కాదని ఇప్పుడు అనవసరంగా కొత్త స్క్రిప్ట్‌ అంటూ రెడీ చేస్తున్నారు అంటూ ఒకింత ఆందోళన బన్నీ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఏది అయితే అదే అనుకుని పుష్ప 2 కు ముందు అనుకున్న స్క్రిప్ట్ తో వెళ్లి ఉంటే బాగుండేది అనేది చాలా మంది అభిప్రాయం. కాని బన్నీ టీమ్‌ మాత్రం బాలీవుడ్‌ లో నచ్చాలి అంటే మెరుగులు దిద్దాలని మొత్తం మార్చారట. పుష్ప 1 కు ఎలాంటి మెరుగులు దిద్దారని బాలీవుడ్‌ ప్రేక్షకులకు నచ్చింది. పుష్ప 2 ను ఎందుకు పూర్తిగా మార్చుతున్నారు అంటూ కొందరు సినీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం లో సుకుమార్‌ నిర్ణయాన్ని తప్పుబట్టే వారు చాలా మంది ఉన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి