Allu Arjun : ఈ మధ్య జనాలు అభిమానం ముసుగులో ప్రాణాలు కోల్పోతున్నారు. మూవీ మొదటి రోజే మొదటి షో చూడాలని థియేటర్స్‌కిపరుగులు పెడుతున్న క్రమంలో తొక్కిసలాట జరుగుతుంది. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరిగిన కూడా ఎవరిలో మార్పు రావడం లేదు. అయితే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్ ని దృష్టిలో ఉంచుకొని సరైన భద్రత చర్యలు పాటించకపోవడం పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు.
దిల్‌షుక్ నగర్‌కు చెందిన రేవత్-భాస్కర్ దంపతులు పిల్లలు శ్రీతేజ్, సన్వీకలతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్య 70ఎంఎం ధియేటర్‌కు వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలకు చొచ్చుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యా నగర్ లోని దుర్గా భాయి దేశముఖ్ హాస్పిటల్‌కు తరలించారు.వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకువెళ్లి సీపీఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు. పుష్ప-2 సినిమా చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు.
వారిలో తల్లి మృత్యువాతపడటం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ సంఘటనతో అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని తెలుస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారని అల్లు అర్జున ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి సంఘటనలే తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల వద్ద చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. అర్ధరాత్రి కావడంతో ఎక్కడ ఏమి జరిగిందనే వార్తలు బయటకు రాలేదు.సినిమా షోకు వచ్చే పబ్లిక్ మాత్రమే కాకుండా హీరో అల్లు అర్జున్ ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎగబడతారని తెలిసి నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు.
సినీ హీరోతో జరిపే ఈవెంట్ పై ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే కార్యక్రమం నిర్వహించడం పై పోలీసులు సీరియస్ అయ్యారు. ఒక సినీ హీరో వచ్చే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు నిర్వాహకులు తీసుకోలేదని మండిపడ్డారు హైదరాబాద్ పోలీసులు. థియేటర్ యాజమాన్య నిర్లక్ష్య ఘటన తోటే మహిళతో మృతి చెందిందని భవిష్యత్తులో సినిమా థియేటర్ నిర్వాహకులకు బెనిఫిట్ షో లేదా ఈవెంట్స్ పై ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. అయితే అకారణంగా ఓ ప్రాణం పోగా, దానికి బాధ్యులు ఎవరు, ఎవరిని కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో కొన్నాళ్లపాటు హడావిడి నడిచి మేటర్ చల్లబడుతుంది. నష్టం మాత్రం ఆ ఫ్యామిలీకే. అందుకే పిచ్చి అభిమానంతో అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దు అంటూ కొందరు సూచనలు చేస్తున్నారు.
Allu Arjun : పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టే ప్రాజెక్ట్ అవుతుంది…
నటీనటులు: లీ జంగ్ జే-వి హా జున్-లీ బ్యుంగ్ హున్ తదితరులు డైరెక్టర్ : హ్వాంగ్ డాంగ్ హ్యుక్ రిలీజ్…
2024 Rewind : మరో నాలుగు రోజులలో 2024కి గుడ్ బై చెప్పి 2025కి స్వాగతం చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ…
Phonepe : ఇంటర్టెన్ వినియోగం పెరగడంతో అన్ని పనులు చాలా సులభం అయ్యాయి. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులన్నీ…
Beer kidney Stones : ఈ రోజుల్లో యువత, పెద్దవారు, అందరూ మద్యపానంకు బాగా అలవాటు పడిపోయారు. యువత పెడదారిన…
Women : బీసీలకు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పలు పథకాల…
Health Benefits Cabbage : కొంతమంది క్యాబేజీని అంతగా ఇష్టపడరు. కానీ క్యాబేజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే…
మనం సాధారణంగా చలికాలంలో చలి ఎక్కువగా ఉందని చెప్పి ముడుచుకొని పడుకుంటాం. అలా ఎక్కువసేపు ముడుచుకొని పడుకొని ఉండడం వల్ల.…
This website uses cookies.