Home » Entertainment » Allu Arjun Introducing Pushpa Raj
Entertainment

Pushpa : పుష్ప టీజర్ రిలీజ్ : తగ్గేదే లే అంటున్న పుష్ప రాజ్..!

Authored By
vamana sai
The Telugu News | Published on: April 7, 2021, 8:52 pm
Advertisement

Pushpa : పుష్ప టీజర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. రేపు అనగా ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప నుంచి టీజర్ రిలీజయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Pushpa : పుష్ప టీజర్ రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే మిలియన్స్ వ్య్యుస్ తో రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో భారీ స్థాయిలో పుష్ప సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. కాగా అల్లు అర్జున్ బర్త్ డే కి స్పెషల్ గా పుష టీజర్ రిలీజ్ చేయడం విశేషం. ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఊర మాస్ గెటప్ లో అదరగొట్టాడు. భారీ యాక్షన్ సీన్స్ ఉనట్టు కంప్లీట్ కల్ట్ కంటెంట్ తో సుకుమార్ మార్క్ తో పుష్ప తెరకెక్కుతున్నట్టు హింట్ ఇచ్చారు. ఇదే టీజర్ లో హీరోయిన్ రష్మిక మందన్నని రివీల్ చేయడంతో పాటు పవర్ ఫుల్ గా పుష్ప రాజ్ “తగ్గేదే లే” అన్న డైలాగ్ ని వినిపించారు. ఇక ఈ టీజర్ రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే మిలియన్స్ వ్య్యుస్ తో రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి