
Allu Arjun : పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే షూటింగ్స్‌తో అంత బిజీగా ఉన్న బన్నీ తన ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో పర్యటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు.నంద్యాల వెళ్లి మరీ ఆయనకు అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది.
ముందస్తు అనుమతి లేదన్న కారణంగా అల్లు అర్జున్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు అలసత్వం వహించారంటూ ఇద్దరు సిబ్బందిపై ఈసీ చర్యలు తీసుకుంది. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుళ్లు.. స్వామి నాయక్, నాగరాజుని వీఆర్ కి పంపించారు. ఈ ఘటన జరిగి రెండు వారాలవుతుండగా.. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుళ్లపై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ భారీగా జన సమీకరణ జరగడంపై ఈసీ సీరియస్ అయింది.
పైస్థాయి అధికారులపై చర్యలు లేకుండా కింది స్థాయి సిబ్బందిపై వేటు వేయడంపై జిల్లాలో ఒకటే ముచ్చటించుకుంటున్నారు. అయితే 60 రోజుల్లో శాఖ పరమైన విచారణకూడా చేయాలని సూచించినట్లు సమాచారం. ఇక బన్నీ నటిస్తున్న పుష్ప2 విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకులకన్నా బాలీవుడ్ ప్రేక్షకులే ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న మూవీ విడుదల కాబోతోంది. పుష్ప మొదటి భాగంలో ఐటం సాంగ్ దేశాన్ని ఎంతలా ఊపేసిందో అందరూ చూశారు.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.