Home » Entertainment » Allu Arjun Rejected An Advertisement
Entertainment

Allu Arjun : ఎంత డబ్బు ఇచ్చిన ఆ యాడ్ ను తిరస్కరించిన అల్లు అర్జున్.!!

Authored By
aruna
The Telugu News | Published on: August 12, 2022, 12:00 pm
Advertisement

Allu Arjun : ఇండస్ట్రీకి పరిచయం లేని పేరు అల్లు అర్జున్. తను పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయాడు. ప్రస్తుతం ఆయన ఒకపక్క సినిమాలు ఇంకొకపక్క యాడ్స్ చేసుకుంటా. బిజీగా ఉంటున్నాడు. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం కొన్ని బ్రాండ్లు తన చుట్టూ తిరుగుతున్నాయి. వారి బ్రాండ్లకు అంబాసిడర్ చేయాలని అని అనుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. అయితే కొన్ని బ్రాండ్ లకు బన్నీ సిగ్నేచర్ చేసేసాడు. అయితే బన్నీ ఒక్క యాడికి 7.5 కోట్ల రూపాయలను తీసుకుంటాడట.

Advertisement

అయితే ఆయనకి తాజాగా 10 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఒక కంపెనీ యాడ్ చేయమని ముందుకు వచ్చారు. కానీ బన్నీ వారికి సింపుల్ గా నో అని చెప్పారట. ఆయన ఎందుకు నో చెప్పారు అనేదాన్ని చూస్తే… ఆ యాడ్ వచ్చేసి మద్యం, గుట్కా లా ప్రకనట అందుకే అల్లు అర్జున్ దానికి నో అని చెప్పాడట. ఇలాంటి వాటికి నేను వ్యతిరేకమని తెలిసి కూడా నన్ను ఎలా చేయమని అడుగుతున్నారు. ఇవి కాదు ఆరోగ్యానికి హాని చేసే ఎటువంటి యాడ్స్ అయినా నా దగ్గరికి తీసుకురావద్దు అని అల్లు అర్జున్ చెప్పారట. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun Rejected an Advertisement

Advertisement

అభిమానుల గుండెల్లో తన రేంజ్ ఇంకా పెరిగిపోయింది అని అంటున్నారు. అదేవిధంగా పుష్ప బాక్సాఫీసులు వద్ద బద్దలైన సంగతి అందరికీ తెలిసిందే. అదే నేపథ్యంలో రెండో భాగం కూడా ఉంటుంది అని అభిమానుల అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పుష్ప ది రూల్ ఫస్ట్ భాగం కంటే అంతకుమించి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం నిర్వహిస్తుండగా.. హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది. ఈ మూవీ తొందర్లో సెట్ మీదికి రానుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి