Home » Entertainment » Allu Arjun Sukumar Pushpa 2 Movie Budget And Social Media Trend
Entertainment

Pushpa 2 : పుష్ప 2 సినిమా ఒకవేళ ‘కేజీఎఫ్‌ 2’ లా కాకుంటే పరిస్థితి ఏంటీ భయ్యా!

Authored By
aruna
The Telugu News | Published on: August 30, 2022, 10:20 pm
Advertisement

Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం హిందీ భాషలోనే ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయలను రాబట్టి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి 400 కోట్ల రూపాయలను ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. పుష్ప సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 తప్పకుండా అంతకు మించి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఇండస్ట్రీ పెద్దలు చాలా నమ్మకంతో ఉన్నారు. మెగా అభిమానులతో పాటు మీడియా మిత్రులు కూడా పుష్ప 2 సినిమాపై అంచనాలను భారీగా పెంచుకొని ఉన్నారు.

Advertisement

ఆ అంచనాలకు అందుకునేలా సినిమాను నిర్మించే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ వారు ఏకంగా 400 కోట్ల రూపాయలను ఈ సినిమాకు బడ్జెట్ గా కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో హీరో అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కి ఇచ్చే పారితోషికం రూ. 150 కోట్లకు పైగా ఉందని సమాచారం అందుతుంది. పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది నిజమే.. ఓకే.. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా అదే స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటే మాత్రం కచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. గతంలో వచ్చిన సీక్వెల్స్ చాలా వరకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచిన విషయం కూడా తెలిసిందే.

allu arjun sukumar pushpa 2 movie budget and social media trend

Advertisement

కేజిఎఫ్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా 1000 కోట్లు సాధిస్తుంది అని నమ్మకంతో మైత్రి మూవీ మేకర్స్ వారు ఏకంగా రూ. 400 కోట్ల బడ్జెట్ను ఈ సినిమాకు పెడుతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో అన్ని సినిమాలు కూడా కే జి ఎఫ్ 2 అవ్వలేవు అంటూ కొందరు మైత్రి మూవీ మేకర్స్ వారికి సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం తగ్గేదేలే అన్న పుష్ప డైలాగ్ ని పాటిస్తూ 400 కోట్లకు పైగానే ఖర్చు చేస్తామంటూ దర్శకుడు సుకుమార్ వద్ద హామీ ఇచ్చారు. దాంతో ఆయన ఆ బడ్జెట్కు తగ్గట్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అతి త్వరలోనే పుష్ప 2 సినిమా వచ్చేది ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి