Home » Entertainment » Allu Arjun To Be Never Mega Star
Entertainment

Allu Arjun : అల్లు అర్జున్ ఎప్ప‌టికీ మెగాస్టార్ కాద‌న్న అల్లు బాబీ

Authored By
Sam C
The Telugu News | Published on: April 5, 2022, 5:30 pm
Advertisement

Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో బ‌న్నీ క్రేజ్ రెట్టింపు అయింది. తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా బన్నీకి దేశ విదేశాల‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, క్రికెట‌ర్స్ బ‌న్నీ సినిమాల‌ని పాట‌ల‌కు ఏ రేంజ్‌లో స్టెప్పులు వేశారో మ‌నం చూశాం. అయితే బ‌న్నీ రానున్న రోజులలో జూనియ‌ర్ మెగాస్టార్‌గా మారుతాడ‌ని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు. మెగా వారసుడు రామ్ చరణ్ కూడా మెగాస్టార్ స్టామినాను కానీ, చార్మింగ్ ని కానీ, డాన్స్ లో ఆ గ్రేస్ ని కానీ మళ్లీ తీసుకురాలేడని అభిమానుల అభిప్రాయం. అందుకే అల్లు అర్జున్ ..

Advertisement

నెక్స్ట్ మెగాస్టార్ అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవ‌ల అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు బాబీకి ఇదే విష‌యంపై ప్ర‌శ్న ఎదురైంది. . గని ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ” బన్నీని మెగాస్టార్ తో పోల్చడం పద్దతి కాదు.. చిరంజీవి స్వయం కృషితో పైకి వచ్చారు. కానీ బన్నీ వెనుక తన తండ్రి, తాత ఉన్నారు. నేను ఎప్పటికీ చిరంజీవి – అల్లు అర్జున్ లను పోల్చి చూడను. నేనే కాదు ఫ్యామిలీ లో అందరికి చిరంజీవి గారే స్ఫూర్తి.. అల్లు అర్జున్ కూడా ఎన్నో సార్లు ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు. అలాంటి స్ఫూర్తి నింపిన వ్యక్తితో పోల్చుకోవడం పద్దతి కాదు .. బన్నీ ఎప్పటికి మెగాస్టార్ కాలేడు” అని చెప్పుకొచ్చారు బాబీ.

allu arjun to be never mega star

Advertisement

Allu Arjun : ఓన్లీ వ‌న్ మెగాస్టార్..

ఇదిలా ఉంటే ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఉగాది సంద‌ర్భంగా అల్లు అర్జున్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి జాత‌కం ఉన్న హీరో అల్లు అర్జున్‌. రాబోయే ఐదేళ్ల‌లో ఆయ‌న జాత‌కంలో ఎలాంటి మార్పులుండ‌వు. ఆయ‌న తీసే సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్లో త‌క్కువ‌లో త‌క్కువ‌గా రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల బిజినెస్‌నే చేస్తాయి. రాసి పెట్టుకోండి. ఆయ‌న చేసే ప్ర‌తి సినిమా రెండు వంద‌ల కోట్ల‌ను దాటుతుందే త‌ప్ప‌.. త‌గ్గ‌దు. ఆయ‌నే ఇప్పుడు బంగారు బాతు. అలాగే ఇద్ద‌రు స్టార్ హీరోస్‌లో ఒక‌రికి ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో సినిమా ఆగిపోయే అవ‌కాశం ఉంది’’ అన్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి