Home » Entertainment » Ananya Pandey Comments On Vijay Devarakonda
Entertainment

Ananya pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని అంత మాట అనేసింది ఏంటి… లైగ‌ర్ బ్యూటీ మాట‌ల‌కు అంద‌రు షాక్..!

Authored By
Sam C
The Telugu News | Published on: February 20, 2022, 12:30 pm
Advertisement

Ananya pandey : యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ యూత్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత విజయ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లైగర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానుంది.

Advertisement

Ananya pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ పిరికివాడా…!

తాజాగా అన‌న్య త‌న కో స్టార్ విజ‌య్ దేవ‌రకొండ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అతడు సహజంగా పిరికివాడు అని,ఒక నటిగా తనకు కావాల్సినంత సౌకర్యాన్నిచ్చిన మనోహరమైన వ్యక్తి అని కూడా కితాబిచ్చేసింది. వీడీ నటించిన అర్జున్ రెడ్డి చూశానని ఆ మూవీ చాలా నచ్చిందని తెలిపింది. నిజానికి అతను పోషించే పాత్రలకు చాలా భిన్నంగా ఉన్నాడు. అని చెప్పుకొచ్చింది అన‌న్య పాండే. లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా నటిస్తున్నారు.

ananya pandey comments on vijay devarakonda

Advertisement

లైగ‌ర్ చిత్రం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ళ్లీ పూరి తోనే సినిమా చేస్తాడ‌ని వార్తలు వచ్చాయి కానీ అది ఎంతవరకు నిజం అన్నది తెలియలేదు. అయితే ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉండనుందనే టాక్ ఇంతకుముందే వచ్చింది. తాజాగా స్క్రిప్ట్ లాక్ చేసినట్టుగా చెబుతున్నారు.శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘నిన్నుకోరి’ .. ‘మజిలీ’ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తరువాత చేసిన ‘టక్ జగదీశ్’ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి