ananya pandey making fun with vijay
Ananya Pandey : ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఈ చిన్నోడు.. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ మరో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నాడు. అనంతరం ‘గీత గోవిందం’తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ యంగ్ హీరో.. ఆ వెంటనే ‘టాక్సీవాలా’తో మరో హిట్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇలా కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను అందుకుని సత్తా చాటుకున్నాడు. త్వరలో లైగర్ సినిమాతో పలకరించబోతున్నాడు. ‘ఆఫట్’ అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం శనివారం ఉదయం విడుదల చేసింది.
ఈ సంవత్సరంలోనే అత్యంత ఉత్సాహాన్నిచ్చే పాట అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. తెలుగు వెర్షన్ కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సింహా, శ్రావణ భార్గవి ఆలపించారు. తనిష్క్ బాగ్చీ సంగీతం సమకూర్చారు. పియూష్, షాజియా కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో విజయ్ సాఫ్ట్ స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అనన్య, విజయ్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా ఉంది. వాస్తవానికి ఈ పాటను శుక్రవారమే విడుదల చేయాలనుకున్నా.. సాంకేతిక కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా వచ్చింది.
ananya pandey making fun with vijay
ఈ పాటలో విజయ్ హీరోయిన్ కి ముద్దులు పెడుతుంటే..అనన్య పాండే ఏమో..మధ్యలో విజయ్ వేళుని కొరికేస్తుంది. అనన్య మీద మీద పడుతున్నాడు. వారి రొమాన్స్ చూస్తుంటే కెవ్వు కేక అనిపిస్తుంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. ఈ నెల 25న హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో పాటు అక్డి పక్డి పాట, వాట్ లగా దేంగే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషురెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో పూరి, చార్మి, కరణ్ జొహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
This website uses cookies.