Home » Entertainment » Anasuya Bharadwaj Comments About Heroins
Entertainment

Anasuya : ‘షూటింగ్ తర్వాత అలా చేస్తేనే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి ‘… అనసూయ

Authored By
aruna
The Telugu News | Published on: November 6, 2023, 12:00 pm
Advertisement

Anasuya : ఒకప్పటి బుల్లితెర యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ షో ద్వారానే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. క్షణం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఏ సినిమాలో అయినా తన పాత్ర ప్రత్యేకమైనది ఏదైనా చేస్తానని అనసూయ చెబుతున్నారు. ఇటీవల అనసూయ పెదకాపు-1, ప్రేమవిమానం సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement

అయితే తాజాగా అనసూయ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోయిన్స్ కి సంబంధించి కామెంట్స్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. హీరోయిన్ పాత్రలు రావాలంటే షూటింగ్ అయిపోయిన తర్వాత జరిగే పార్టీలకు హాజరు కావాల్సి ఉంటుంది అని అనసూయ అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుందని అనసూయ తెలిపారు. టాలెంట్ ఉన్న అవకాశాలు వచ్చేది తక్కువే అని ఆమె వెల్లడించారు.

షూటింగ్ తర్వాత జరిగే నైట్ పార్టీలకు తాను దూరంగా ఉంటానని, బహుశా అందుకేనేమో తనకు హీరోయిన్గా అవకాశాలు రాలేదని అనసూయ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే చేయాలని అనుకున్న కానీ ఇప్పుడు ఏ పాత్రకైనా న్యాయం చేయగలనని నమ్మకం వచ్చింది అని అనసూయ చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి కూడా అనసూయ స్పందించారు. సోషల్ మీడియాలో తనని విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నా పోస్టుల ద్వారా స్ఫూర్తి పొందే వారి సంఖ్య కూడా అదే రీతిలో ఉందని అనసూయ పేర్కొన్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి