anasuya giving final warning to vijay devarakonda fans
Anasuya : లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడం నెట్టింట పెద్ద రచ్చకు దారితీసింది. జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ వార్ నడుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన లైగర్ మూవీ దారుణమైన టాక్ తెచ్చుకోవడంతో అటు చిత్ర బృందం తీవ్ర నిరాశకు లోనైంది. అటు పూరి జగన్నాథ్, చార్మి, విజయ్ ఇలా ఎవ్వరూ రెండ్రోజుల నుంచి బయటకు రాలేదు. సింగిల్ కామెంట్ కూడా చేయడం లేదు. శుక్రవారం విజయ్ ఎట్టకేలకు బయటకొచ్చి లైగర్ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంపై స్పందించాడు.
తమ అభిమాన నటుడి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ బాధ నుంచి ఎలా బయటపడాలని ఫ్యాన్స్ చూస్తుండగా.. యాంకర్ అనసూయ రగులుతున్న నిప్పురవ్వలపై పెట్రోల్ పోసింది. దీంతో ఆ అగ్నికి దహించుకుపోయిందని చెప్పవచ్చు. లైగర్ సినిమా ప్లావ్ అని టాక్ రావడంతో ‘తల్లి ఉసురు తాకిందని..కర్మ ప్రతిఫలం అనేది రావడం ఆలస్యం అవడం లేట్ కావొచ్చేమో కాని రావడం మాత్రం పక్కా అని’.. డబ్బులిచ్చి మరీ మాదర్… అని అమ్మను బూతులు తిట్టిస్తారా అని ఫైర్ అయ్యింది. లైగర్ సినిమా ప్లాప్ కావడంతో తాను సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ట్వీట్స్ చేసింది. అర్జున్ రెడ్డి మూవీ సమయంలో విజయ్ చెప్పే ‘ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్….’
anasuya giving final warning to vijay devarakonda fans
అనే బూతు పదాన్నివాడితే రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా అంటూ అనసూయ విజయ్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది. గతంలో ఇదేవిషయమై విజయ్, అనసూయ మధ్య పెద్ద వార్ నడిచింది. తాజాగా విజయ్ సినిమా ఓటమిని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు అనసూయ పేర్కొనడంతో.. ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆంటీ అని పిలుస్తూ ఆమె బాడీషేమింగ్ పై విపరీతమైన కామెంట్స్ చేశారు. దీంతో అనసూయ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ స్క్రీన్ షాట్స్ తీసి నన్ను ట్రోల్ చేయడం ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ పిక్స్ సెండ్ చేస్తానని బెదిరించింది.నా ఫ్యామిలీ జోలికి గానీ, నా జోలికి గానీ వస్తే అస్సలు ఊరుకోను అంటూ ఘాటుగా స్పందించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.