Home » Entertainment » Anasuya Latest Video On Instagram
Entertainment

Anasuya : నిన్ను చాలా మిస్ అయ్యాను ‘ అనసూయ ఎమోషనల్ పోస్ట్..!

Authored By
aruna
The Telugu News | Updated on: September 10, 2023, 9:21 pm
Advertisement

Anasuya : బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లలో సుమ తర్వాత మోస్ట్ పాపులర్ యాంకర్ గా అనసూయ కీ పేరు ఉంది. కానీ ఆమె యాంకర్ కి బ్రేక్ ఇచ్చేసి సినిమాల వైపు వెళ్లారు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో అనసూయకు మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఈ షో ద్వారా ఆమె వెండితెరకు కూడా పరిచయం అయ్యారు. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను వదిలేసి అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతుంది. రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. యాంకరింగ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసి సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ లో సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. అప్పుడప్పుడు కొన్ని వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయంపై కూడా స్పందిస్తూ నెటిజన్ల నుంచి ట్రోల్స్ కూడా ఎదుర్కుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇటీవల బాలీవుడ్ లో అలియా భట్, రణ్వీర్ సింగ్ కలిసి నటించిన రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని సినిమాలోని వాట్ ఝుంకా పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోను అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Anasuya latest video on Instagram

Advertisement

ఆ వీడియోను షేర్ చేస్తూ అనసూయ ఇలా రాసుకొచ్చింది. నాకు తెలుసు. ఈ ట్రెండ్ కి చాలా ఆలస్యం అయ్యాను. కానీ ఇప్పటికి నేను ఇక్కడే ఉన్నాను. అలాగే నేను ఈ పాటకి డాన్స్ ఎంత మిస్ అయ్యాను గ్రహించాను అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పాటల్లో ఒకటి ఈ పాట. ఈ పాటకు అనసూయ డాన్స్ చేస్తూ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో పై అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి అనసూయ తన వీడియోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి