Anasuya : అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్.. రిజెక్ట్ చేసిన అనసూయ ..!
Anasuya : మాజీ బుల్లితెర యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె ఎన్నో సహాయ పాత్రలతో పాటు కొన్ని సినిమాలలో కీలక పాత్రలు కూడా పోషించారు. చాలామంది హీరోలు తమ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు. అందుకే అనసూయకు స్టార్ హీరోల సినిమాలలో కచ్చితంగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 1లో లేడీ విలన్ గా కనిపించారు. విలనిజం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు ముందు అల్లు అర్జున్ పక్కన నటించే ఛాన్స్ అనసూయ కు వచ్చిందట. కానీ ఈ బ్యూటీ ఈ ఛాన్స్ ను వదులుకున్నారట.
న్యూస్ రీడర్ గా ప్రారంభించిన అనసూయ బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఫుల్ పాపులర్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘ క్షణం ‘ అనే సినిమా ద్వారా వెండితెరపై కనిపించారు. అంతకుముందు ‘ సోగ్గాడే చిన్నినాయన ‘ సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించారు. మెయిన్ పాత్ర మాత్రం ఆమెకు క్షణం సినిమా అనే చెప్పాలి. ఇందులో పోలీస్ పాత్రలో నటించిన అనసూయకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే అందరి అమ్మాయిల లాగానే అనసూయ కూడా హీరోయిన్ కావాలని ఆశ ఉండేది. అయితే ఆ హీరోయిన్ ఛాన్స్ రాకపోయినా ఆ రేంజ్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో ప్రత్యేక పాటలో కూడా కనిపించి డాన్స్ చేశారు.
అయితే అనసూయ మంచి మంచి అవకాశాలను మిస్ చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశాన్ని ఆమె కోల్పోయారు. అల్లు అర్జున్ తో సుకుమార్ ‘ ఆర్య 2 ‘ సినిమా తీస్తున్న సమయంలో ఓ పాత్ర కోసం అనసూయను సంప్రదించారట. తమ సినిమాలో నటించాలని కోరారట. అయితే ఆ సమయంలోనే అనసూయకు వివాహ నిశ్చితార్థం అయ్యిందట. ఆ సమయంలో పెళ్లి కాదని సినిమాలో నటిస్తే బాగోదని ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. ఆర్య సినిమాలో అనసూయ ఏపాత్రం మిస్ చేసుకుందనేది మాత్రం తెలియలేదు. ఆర్య 2 లో హీరోయిన్ గా కాజల్ నటించారు. ఆమె తర్వాత పొజిషన్లో శ్రద్ధాదాస్ నటించారు. ఈ పాత్ర కోసం అనసూయని అడిగి ఉంటారని తెలుస్తుంది.
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.