Home » Entertainment » Anasuya Still From Pushpa Trailer Tease
Entertainment

Anasuya : సునీల్ మీదకు ఎక్కేసిన అనసూయ!.. బ్లేడుతో అది కోసేస్తుందా?

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: December 4, 2021 10:14 am
Advertisement

Anasuya బుల్లితెరపై,వెండితెరపై అనసూయ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. జబర్దస్త్ షోతో దుమ్ములేపిన అనసూయ.. వెండితెరపై ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో అనసూయ చేసిన పాత్రలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయాయి. ఇక ఇప్పుడు మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయింది.

Advertisement

రంగమ్మత్తగా అదిరిపోయే పాత్రను ఇచ్చిన సుకుమార్.. ఇప్పుడు దాక్షాయణిగా చూపించబోతోన్నాడు. అనసూయ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. రంగమ్మత్తను మరిచిపోయి.. దాక్షాయణిగా మైమరింపజేసేలా ఉంది. నిన్న వదిలిన ట్రైలర్ టీజ్‌లో అనసూయ దుమ్ములేపేసింది. డిసెంబర్ 6న విడుదల కానున్న ట్రైలర్‌కు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ వదిలారు.

anasuya still from pushpa trailer tease

Advertisement

Anasuya బ్లేడుతో అనసూయ రచ్చ..

అందులో అనసూయ కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. దాక్షాయణి అయిన అనసూయ మంగళ శ్రీను అయిన సునీల్ మీదకు ఎక్కేసింది. చూస్తుంటే అదేదో బోల్డ్ సీన్‌లా ఉంది. ఇక నోట్లో బ్లేడును పెట్టుకుని ఏదో కోపంలో కనిపిస్తోంది. కొంపదీసి ఉప్పెన సినిమాలోలా ఏదైనా కట్ చేస్తుందా? అని అందరూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి సునీల్, అనసూయ మధ్య మాత్రం మంచి సీన్లే పడ్డట్టున్నాయి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి