Home » Entertainment » Anchor Manjusha Dance For Kacha Badam Song
Entertainment

Anchor Manjusha : బొద్దుగా మారిన మంజూష‌.. సూప‌ర్ హిట్ పాట‌కు ఆ స్టెప్పేలేంది త‌ల్లి…!

Authored By
Sam C
The Telugu News | Published on: February 19, 2022, 5:30 pm
Advertisement

Manjusha : జూనియ‌ర్ ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించి అల‌రించిన అందాల ముద్దుగుమ్మ మంజూష‌. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి.. తన అందచందాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ తెలుగు పిల్లకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే పలు అదిరిపోయే షోలను హోస్ట్ చేసింది.పెద్ద పెద్ద సినిమాల ప్ర‌మోష‌న్స్ కోసం స్టార్స్ ని ఇంట‌ర్వ్యూలు చేస్తుంటుంది. అలానే సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

Advertisement

తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న క‌చ్చా బాదమ్ పాట‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆమె స్లీవ్‌లెస్ టాప్‌తో పాటు టైట్ ప్యాంట్ ధరించి ఉంది. దీనికితోడు ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతోన్న పాటకు డిఫ‌రెంట్‌ భంగిమలతో డ్యాన్స్ చేసింది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి.. తక్కువ టైంలోనే వైరల్ అయిపోయింది. అయితే ఇందులో మంజూష లుక్స్ చూసి కొంద‌రు స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. అంత లావు అయిపోయావేంట‌ని కొంద‌రు కామెంట్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు ఆ స్టెప్పులేంద‌ని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Manjusha dance for kacha badam song

Advertisement

Manjusha : బొద్దుగుమ్మ అద‌ర‌గొట్టింది..

కచ్చా బాదమ్‌.. ఇప్పుడు సోషల్‌మీడియాను ఊపేస్తుండ‌గా, ఈ పాట‌కు సెలెబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా హుషారైన స్టెప్పులతో మిలియన్ల కొద్దీ జనం ఈ సాంగ్‌ను తెగ ఎంజాయ్‌ చేసేస్తున్నారు. పల్లీలు అమ్ముకునే సాధారణ వ్యక్తి ఈ పాటను క్రియేట్ చేయగా.. దానికి ‘గోధూలిబేల మ్యూజిక్’ కంపెనీ రీమిక్స్‌ వెర్షన్‌ను జోడించి సోషల్ మీడియలోకి వదిలారు. అంతే ఈ పాటకు లక్షల కొద్దీ వ్యూస్‌ వచ్చిపడుతున్నాయి. అంతలా ఫేమస్‌ అయిపోయింది. ఈ సాంగ్‌ ఇంత సెన్సేషన్‌గా మారినా అతను ఆర్ధికంగా ఏమైనా లబ్దిపొందాడా లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బద్యాకర్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్టు ప్రకటించింది స‌ద‌రు మ్యూజిక్ కంపెనీ.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి