
Anchor Rashmi Gautam Emeotional Dance Performance in Mana OOri devudu Event
Rashmi Gautam : మల్లెమాల చేసే ఈవెంట్లు, వారి కొత్త కొత్త ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. బుల్లితెరపై మల్లెమాలకు ఎంటర్టైన్మెంట్‌లో ఎదురులేదన్నది అందరికీ తెలిసిందే. ఏ పండుగైనా సరే ఈటీవీలో ఈవెంట్ వస్తోందంటే.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ఈ సారి వినాయక చవితి పండుగ ఈవెంట్ అని చెప్పారు. కానీ అందులో వినాయకుడి గురించి తప్పా మిగతాది అంతా ఉంది. అవే పాటలు, అవే మాటలు.. పిచ్చి జోకులు, వెకిలి చేష్టలు కనిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ అయితే అందరినీ కట్టిపడేసింది. రష్మీకి ఇది వరకే పెళ్లి అయిందని, డివోర్స్ అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి కథనాలు వస్తుంటాయి.
అయితే రష్మీ తల్లిదండ్రులు మాత్రం విడిపోయారు. రష్మీ చిన్నతనం నుంచి కూడా తన అమ్మే పెంచి పోషించి పెద్ద చేసింది. తండ్రి ప్రేమ అంటే ఏంటో తనకు తెలీదని రష్మీ స్టేజ్ మీదే ఎన్నో సార్లు కంటతడి పెట్టుకుంది. అలాంటి రష్మీ ఇప్పుడు బ్రేకప్ బాధను అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. రష్మీ పర్ఫామెన్స్ చేసిన తీరు చూస్తుంటే.. నిజంగానే తనకు బ్రేకప్ జరిగిందా? అనే అనుమానం కలిగించేస్తోంది. తాను ఏది చేసినా కూడా జనాలను ఎంటర్టైన్ చేసేందుకేనని, ఇది వరకు ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చింది. తెరపై చూపించేది నిజం కాదని చెప్పుకొచ్చింది. సుధీర్‌ను పెళ్లి చేసుకో అని అభిమానులు పదే పదే అడుగుతుండటంతో రష్మీ ఇలా చెప్పింది.
Anchor Rashmi Gautam Emeotional Dance Performance in Mana OOri devudu Event
తామిద్దిరం కేవలం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, స్క్రీన్ మీద కేవలం ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకే అలా నటిస్తామని తెలిపింది. అయితే రష్మీకి లవ్ స్టోరీ ఉందని, బ్రేకప్ జరిగిందనేది రూమరా? నిజమా? అన్నది తెలియడం లేదు. కానీ తాజాగా ఆమె డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి అందరూ ఒకే డైలాగ్ చెబుతున్నారు. బాధలోంచి వచ్చే ఎమోషన్, డ్యాన్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇదే మాటలను ఈవెంట్‌లో కూడా అనేశారు. నిజంగా రష్మీ అంత బాధను అనుభవించిందా? అందుకే అంతలా డ్యాన్స్ చేసిందా? అని జనాలు అనుకుంటున్నారు. అటు నువ్వే ఇటు నువ్వే అనే పాటకు రష్మీ చేసిన పర్ఫామెన్స్ అందరినీ కదిలించేలా ఉంది.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.