Rashmi Gautam : యాంకర్ రష్మి ఏడుపులకు విలువే లేదా?.. జనాలను పిచ్చోళ్లను చేసేశారుగా!
rashmi gautam : బుల్లితెరపై టీఆర్పీలను సాధించేందుకు కొన్ని షోలు పడరాని పాట్లు పడుతున్నాయి. అయితే వీటి కోసం ఎక్కువగా ప్రోమోల మీద ఆధారపడుతున్నాయి. ఎపిసోడ్‌లో ఏదో ఉండబోతోందనే ఆత్రుతను క్రియేట్ చేసేలా ప్రోమోలను ఎడిట్ చేస్తుంటారు. కొన్ని సార్లు ప్రోమోలో ఉన్నవి కూడా ఎపిసోడ్‌లో ఉండవు. అలా ప్రోమోలను నమ్మి ఎపిసోడ్‌లను చూసే జనాలు కూడా తగ్గుతున్నారు. అలా వారు ఎప్పుడైతే ప్రోమోలను కావాలనే తప్పు పట్టించేలా ఎడిట్ చేయిస్తున్నారో అప్పుడే జనాలు కూడా పట్టించుకోవడం మానేశారు.
Anchor Rashmi Emotional In Rakesh Rohini Skit
అలాంటి వాటిలో తాజాగా ఓ ఉదాహరణ దొరికింది. గత వారం విడులైన జబర్దస్త్ ప్రోమోలో రష్మీ తెగ ఏడ్చేసింది. రాకేష్ రోహిణిల ప్రపోజల్ చూసి రష్మీ కంటతడి పెట్టేసుకుంది. ఇక రాకేష్ స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయాడు. అలా రష్మీ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అయితే ఏం జరిగి ఉంటుందా? అని ఎపిసోడ్ కోసం జనాలు బాగానే ఎదురుచూశారు.
rashmi gautam రష్మీ కన్నీళ్లు వృథా..
Anchor Rashmi Emotional In Rakesh Rohini Skit
కానీ తీరా చూస్తే అక్కడ ఏం లేదు. ప్రోమోలో ఏముందే.. అదే ఉంది. కనీసం రష్మీ ఎందుకు ఏడ్చింది.. అనే విషయాన్ని కూడా క్లారిటీగాచెప్పలేదు. రాకేష్ స్టేజ్ మీద నుంచి ఎందుకు వెళ్లాడు అనేది అస్సలే క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి రష్మీ కన్నీళ్లకు విలువే లేకుండా పోయింది. ప్రోమోలో చూపించిన ప్రపోజల్ స్కిట్ కోసమేనని జనాలు ముందే పసిగట్టారు. కానీ రష్మీ ఎందుకు ఏడిచిందా? అని అందరూ ఎదురుచూశారు. కానీ దానికి వివరణ మాత్రం ఇవ్వలేకపోయారు.
