Home » Entertainment » Anchor Rashmi Gautam Entry To Bigg Boss
Entertainment

Rashmi Gautam : బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న యాంకర్ రష్మి .. ఇక ఫ్యాన్స్ కు పండగే ..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 10, 2023, 6:40 pm
Advertisement

Rashmi Gautam : తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్ నుంచి ఈ సీజన్ వరకు ఈ షోకు చాలామంది అభిమానులు ఉన్నారు. లాస్ట్ సీజన్ అభిమానులను నిరాశపరిచినప్పటికీ నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో మొదలైన బిగ్ బాస్, రెండో సీజన్ లో నానీ, తర్వాతి నాలుగు సీజన్ లు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 కి రష్మీ ఎంటర్ అవ్వబోతుందని తెలుస్తుంది.

Advertisement

Anchor Rashmi Gautam entry to Bigg Boss

బుల్లితెరపై పాపులర్ అయిన యాంకర్ రష్మీ ముందుగా హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జబర్దస్త్ షో తో రష్మీ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. తనకు మంచి పేరు గుర్తింపు సంపాదించి పెట్టిన జబర్దస్త్ షో లో దాదాపుగా 10 ఏళ్ల నుంచి యాంకర్ గా చేస్తుంది. రష్మీ ఓవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. ఇక రష్మీ బిగ్ బాస్ లోకి రావడం అనేది కొత్త విషయం కాదు. ఎందుకంటే బిగ్బాస్ షో మొదలైనప్పటినుంచి రష్మీకి పిలుపు వస్తూనే ఉందట.

Advertisement

Anchor Rashmi Gautam entry to Bigg Boss

కానీ రెమ్యూనరేషన్ చాలాకో లేదా కొన్ని కారణాల వలనో ఆమె ప్రతిసారి నో చెప్పేస్తుందట. అయితే బిగ్ బాస్ ఇదివరకు ఉన్న క్రేజ్ లాస్ట్ సీజన్ తో తగ్గిపోయింది. దీంతో షోకి క్రేజ్ తీసుకురావాలంటే యాంకర్ రష్మీ నీ ఎలాగైనా తీసుకురావాలని బిగ్బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకు రష్మీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు బిగ్బాస్ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు సార్లు బిగ్ బాస్ షోను నిరాకరించిన రష్మీ ఏడవ సీజన్ కైనా వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి రష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి