Anchor Ravi fans fires on Big Boss 5 Telugu team
Anchor Ravi : బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టాప్ సెలబ్రిటీ హోదాలో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలో దిగిన యాంకర్ రవి… ఊహించని విధంగా 12వ వారం ముగిసే నాటికి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. రవి టాప్ 5లో ఉంటాడనుకున్న అభిమానులంతా.. అతడి ఎలిమినేషన్ వార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రతివారం నామినేట్ అవుతున్నా.. అందరి కంటే ఎక్కువ ఓట్లు గెలుచుకుని సేవ్ అవుతూ వచ్చిన తమ అభిమాన కంటెస్టెంట్ ను… అలా ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ అతడి అభిమానులు బిగ్ బాస్ యాజమాన్యంపై మండి పడుతున్నారు. రవికి కావాలనే అన్యాయం చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఏకంగా రవి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే అతడిని హౌస్ నుంచి పంపించారంటూ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు పలు చర్చలకు దారి తీస్తున్నాయి.
గత రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లోని బిగ్ బాస్ సెట్ ఎదుట… రవి ఎలిమినేషన్ ని తప్పు పడుతూ అతడి అభిమానులు ఆందోళన చేపట్టారు. రవి ఎలిమినేషన్ పక్కా అన్‌ఫెయిర్ అంటూ బిగ్‌బాస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా సెట్ ఎదుట రచ్చ రచ్చ చేశారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలపాలని డిమాండ్ చేశారు. తోటి కంటెస్టెంట్ లు… ప్రియాంక, సిరి, కంటే రవికే ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. రవి లేని బిగ్ బాస్ ను తాము చూడమన్నారు. మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా రవిని హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Anchor Ravi fans fires on Big Boss 5 Telugu team
మరో వైపు సోషల్ మీడియాలో సైతం రవి ఎలిమినేషన్ పై పెద్ద చర్చ నడుస్తోంది. షణ్ముక్ గెలుపు కోసమే రవిని హౌస్ నుంచి బయటకి పంపించేశారంటూ బిగ్ బాస్ టీమ్ పై విరుచుకు పడుతున్నారు. గేమ్ బాగ్ ఆడుతున్న రవిని తీసేసి… సోఫాకే పరిమితమైన షణ్ముక్ ను గెలిపిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రవికి తక్కువ ఓట్లు వచ్చాయంటే ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరని అన్నారు. నామినేట్ అయిన వారిలో… ఓటింగ్ పరంగా చూస్తే రవి 3వ స్థానంలో ఉన్నారని అన్నారు. గత కొన్ని వారాలుగా రవి గ్రాఫ్ బాగా పెరుగుతూ వచ్చిందన్నారు. ప్రతీవారం నామినేట్ అవుతున్నా… ఒంటరిగా పోరాడుతూ.. మరింత స్ట్రాంగ్ అయ్యాడని అంటున్నారు. రవి కంటే వీక్ గా ఉన్న ఇతర కంటెస్టెంట్స్‌ను హౌస్ లో పెట్టుకుని.. గేమ్ బాగా ఆడుతున్న రవిని బయటిని పంపించడం దారుణం అంటున్నారు.
మరోవైపు హౌస్ నుంచి బయటకొచ్చిన రవి.. తన ఎలిమినేషన్‌పై రియాక్ట్ అయ్యారు. తాను ఎలిమినేషన్ అవుతానని అస్సలు ఊహించలేదని అన్నారు. గేమ్ బాగా ఆడినప్పటికీ ఎలిమినేట్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇంత మంది అభిమానం చూశాక… తానే గెలిచినట్లు భావించానని అన్నారు. తన ఎలిమినేషన్ విషయంలో తప్పు తీర్పు వచ్చిందని తన అభిమానులు నమ్ముతుండటం పట్ల తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.