
Tributes paid to Thotla Malsur on his 26th death anniversary
Hyderabad : హైదరాబాద్‌లోని వృత్తిదారుల భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కల్లుగీత కార్మిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తోట్ల మల్సూర్ 26వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ అధ్యక్షత వహించారు. ప్రారంభంలో మల్సూర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తోట్ల మల్సూర్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. భూమి కోసం, ప్రజల విముక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ఆయన ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. సమ సమాజం ఏర్పడాలని లక్ష్యంగా పెట్టుకుని దొరలు, జాగిర్దారులు, జమీందారుల దోపిడికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన పోరాట యోధుడు మల్సూర్ అని కొనియాడారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన అనేక ప్రజా పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కుల సాధనకు కృషి చేశారని తెలిపారు.
Hyderabad : తోట్ల మల్సూర్ 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కార్మికుల జీవనోపాధి, సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా మల్సూర్ గుర్తింపు పొందారని అన్నారు. మల్సూర్ ప్రజా ప్రతినిధిగా కూడా విశిష్ట సేవలు అందించారని నాయకులు గుర్తు చేశారు. నూతనకల్లు జడ్పిటిసి సభ్యుడిగా, వెలకపల్లి సింగిల్ విండో చైర్మన్‌గా, శిల్పకుంట్ల గ్రామ సర్పంచిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన ఆయన ఆశయాలను సంఘం రాష్ట్ర కమిటీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకదారుల రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ళఆశయ ,మత్స్యకా రుల హైదరాబాద్ సిటీ చైర్మన్ కొప్పు పద్మ , బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు, చౌరవృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేష్ ,సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. వెంకట నరసయ్య ,తొలుత మల్సూర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సంఘం సీనియర్ నాయకులు అబ్బ గాని బిక్షం తదితరులు పాల్గొన్నారు.
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
This website uses cookies.