Home » Entertainment » Anchor Ravi In Bigg Boss 5 Telugu 1st Week Nomination
Entertainment

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో యాంకర్ రవికి ఎదురుదెబ్బ!

Authored By
aruna
The Telugu News | Published on: September 7, 2021, 7:47 pm
Advertisement

Bigg Boss 5 Telugu :  బిగ్ బాస్ షో అనేదాన్ని అంత ఈజీగా అంచనా వేయలేం. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. బయట ఎంత తురుమ్ ఖాన్‌లైనా సరే బిగ్ బాస్ ఇంట్లో తుస్సు మనే అవకాశం ఉంటుంది. అలా బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తుంటారు.. ప్రవర్తిస్తుంటారు. ఇక బయటి నుంచి చూసే జనాలు అయితే కంటెస్టెంట్లను ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. కంటెస్టెంట్లను ఎంతో క్షుణ్నంగా పరిశీలిస్తుంటారు.

Advertisement

Anchor Ravi In Bigg Boss 5 Telugu 1st week nomination

అలా ఇప్పుడు యాంకర్ రవి పరిస్థితి, ఆయన్ను చూసే కోణం కూడా మారేట్టు కనిపిస్తోంది. బుల్లితెర, సోషల్ మీడియాలో యాంకర్ రవి క్రేజ్ వేరే లెవెల్. ఫుల్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతోన్నాడు. అలాంటి యాంకర్ రవికి బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారమే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ అయ్యాడు. అయితే కంటెస్టెంట్లు చెప్పిన కారణాలు మాత్రం యాంకర్ రవి ఇమేజ్‌కు దెబ్బకలిగేలా ఉంది.

Advertisement

 

Anchor Ravi In Bigg Boss 5 Telugu 1st week nomination

Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో యాంకర్ రవికి ఎదురుదెబ్బ!

యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.. నటిస్తున్నాడు.. అంటూ కారణాలు చెప్పారు. ఇక నామినేషన్ అవుతున్న సమయంలోనూ యాంకర్ రవి హావభావాలు కూడా మారిపోయాయి. నామినేషన్లకు యాంకర్ రవి భయపడుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఏది ఏమైనా కూడా యాంకర్ రవి ప్రయాణం బిగ్ బాస్ ఇంట్లో చాలా దూరం కొనసాగనుందని తెలుస్తోంది. ఇలా మొదటి వారంలోనే ఇంటి నుంచి నిష్క్రమించేంత వీక్ కంటెస్టెంట్ కాదు. మొదటి వారంలో యాంకర్ రవి, కాజల్, జెస్సీ, సరయు, హమీద, మానస్ నామినేట్ అయ్యారు.

 

Anchor Ravi In Bigg Boss 5 Telugu 1st week nomination

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి