Home » Entertainment » Anchor Sreemukhi Get Big Film Chance But She Dont Want To Do That Movie
Entertainment

Sreemukhi : శ్రీముఖికి భారీ పారితోషికంతో హీరోయిన్ ఛాన్స్‌… ఆ కారణంతో నో చెప్పిందట!

Authored By
aruna
The Telugu News | Published on: September 11, 2022, 6:00 pm
Advertisement

Sreemukhi : బుల్లితెర రాములమ్మ అంటూ అభిమానులు ఎంతో అభిమానంతో పిలుచుకునే ముద్దుగుమ్మ శ్రీముఖి. యాంకర్ గా శ్రీముఖి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా ఈమెకి గతంలో పలు ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకు రాగా.. కొన్ని ఆమెకు చెడ్డ పేరుగా నిలిచాయి. దాంతో సినిమాలకు శ్రీముఖి దూరం అయింది, పూర్తిగా బుల్లి తెరపై ఆమె దృష్టి పెట్టింది. వరుసగా కార్యక్రమాలను చేసుకుంటూ ఏకంగా హీరోయిన్ స్థాయి గుర్తింపును క్రేజ్‌ ని ఆమె సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె చేసే సందడి అంతా కాదు.. రెగ్యులర్ గా హీరోయిన్స్ మాదిరిగా అందాల ఆరబోత ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రకారుకి మత్తెక్కిస్తోంది.

Advertisement

ఈ అమ్మడు ఆ ఫోటో షూట్స్ కారణంగా తాజాగా ఒక సినిమా ఛాన్స్ దక్కించుకుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా ఛాన్స్ వచ్చిన మాట నిజమే కానీ ఆ సినిమాకు శ్రీముఖి నో చెప్పింది అనేది మరికొందరి వాదన. సాధారణంగా కంటే కాస్త ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు దర్శకుడు ఓకే చెప్పాడట, అయినా కూడా శ్రీముఖి ఆ సినిమాకు నో చెప్పిందని సమాచారం అందుతుంది. ఆ సినిమాలో కాస్త బోల్డ్‌గా నటించడంతో పాటు వల్గర్ కామెడీ ఉండడం వల్లే ఆ సినిమాను తిరస్కరించినట్లుగా శ్రీముఖి సన్నిహితులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు డీసెంట్ పాత్రలను మరియు డీసెంట్‌ సినిమాలను చేయాలనే ఉద్దేశంతో శ్రీముఖి ఉన్నట్లుగా తెలుస్తోంది.

anchor Sreemukhi get big film chance but she don’t want to do that movie

Advertisement

అందుకే భారీ పారితోషికం ఇస్తానన్నా కూడా ఆ సినిమాను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. డీసెంట్ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న శ్రీముఖి నిర్ణయాన్ని ఆమె అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభినందిస్తున్నారు. శ్రీముఖి ముందు ముందు హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడం వల్ల తప్పకుండా మంచి క్రేజ్ వచ్చి.. ముందు ముందు ఈమెకు ఇమేజ్ కి తగ్గ పాత్రలు దక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి