Anchor Suma : ఇంట్లో అలాంటివి మాట్లాడుకోం.. గుట్టు విప్పిన యాంకర్ సుమ
Anchor Suma యాంకర్ సుమ Anchor Suma ఇంట్లో ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది.. స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడుతూ ఉంటుంది? అనే విషయాలు అందరికీ తెలిసివనే. ఈ లాక్డౌన్ వల్ల సుమ తన అభిమానులకు మరింత దగ్గరైంది. లాక్డౌన్ వల్ల సుమ ఎక్కువగా సోషల్ మీడియాలో దుమ్ములేపేయడం ప్రారంభించింది. రకరకాల వీడియోలతో అందరినీ ఆకట్టుకుంది. తాను ఇంట్లో ఎలా ఉంటారో చూపిస్తూ అసలు విషయాలు ఎన్నో చెప్పేశారు. తనకు పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టమని వీడియో ద్వారా స్పష్టం చేశారు.
Anchor Suma About Rajeev Kanakala Pesonal Issue
రాజీవ్ కనకాలపై సుమ.. Anchor Suma
తన ఇళ్లు ఎలా ఉంది? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అనే విషయాలను కూడా పంచుకుంది. అయితే రాజీవ్ కనకాల, సుమ వేర్వేరుగా ఉంటున్నారనే రూమర్లకు కూడా చెక్ పెట్టేసింది. ఓసారి రాజీవ్ కనకాల లైవ్‌లోకి వచ్చాడు. అక్కడ సుమ తన పని తాను చేసుకుంటూ కనిపించింది. ఆమె బిజీగా ఉందంటూ సుమ మీద కౌంటర్లు కూడా వేశాడు. అయితే తాజాగా ఈ ఇద్దరూ ఇంట్లో ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారనే సంగతులు బయటకు వచ్చాయి.
Anchor Suma Fun With Dance Masters In Cash
లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ టీంను సుమ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా రాజీవ్ కనకాల మ్యాటర్ వచ్చింది. ఆయన ఇందులో ఎలాంటి రోల్ చేశారో తెలుసా? అని టీం అడిగింది. మేం ఇంట్లో ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడుకోం.. ఆయన ఆ పాత్ర, ఈ పాత్ర అని చెప్పరు. నేను కూడా ఏమీ అడగను. చెప్పను. ఏదైనా సరే నేరుగా థియేటర్లో చూసేయడమే అంటూ సుమ చెప్పేసింది. మొత్తానికి రాజీవ్ కనకాల మాత్రం లవ్ స్టోరీలో చాలా రోజుల తరువాత గుర్తుండిపోయే పాత్ర వేసేశాడు.
