Home » Entertainment » Anchor Suma About Sudigali Sudheer Craze
Entertainment

సుధీర్ అన్న తోపు అంటోన్న సుమ.. ఒప్పుకోక తప్పడం లేదు మరి!!

Authored By
Admin
The Telugu News | Updated on: December 12, 2020, 7:43 pm
Advertisement

సుడిగాలి సుధీర్ క్రేజ్ బుల్లితెరపై రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు సుధీర్‌పై కుళ్లు జోకులు వేసినా అందరూ తీసుకున్నారు. కానీ ఇప్పుడు సుధీర్‌ను ఏమైనా అంటే మాత్రం ఆయన ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. అది ఏ ఈవెంట్ అయినా, ఏ షో అయినా గానీ సుధీర్‌ను కించపరిచేలా సెటైర్లు ఉంటే కామెంట్ సెక్షన్లలో ఓ యుద్దమే జరుగుతోంది. సుధీర్‌కు సపోర్ట్‌గా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు. ఆ మధ్య ఢీ షోలో సుధీర్ మీద కౌంటర్లు మితి మీరడంతో పెద్ద రచ్చే జరిగింది.

Advertisement

Anchor Suma About Sudigali Sudheer Craze

బాబా భాస్కర్ సుధీర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఢీ షోను, బాబా భాస్కర్‌ను సుధీర్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. చివరకు బాబా మాస్టర్ తగ్గాడు. సుధీర్ గ్రేట్ అని పొగిడాడు. అయితే సుధీర్ మాత్రం తనపై వచ్చే సెటైర్లు, వేసే పంచ్‌లను స్పోర్టీవ్‌గా తీసుకుంటానని చెబుతుంటాడు. ఏం చేసినా కూడా అది ఎంటర్టైన్ చేయడానికి, నా మీద పంచ్‌లు వేస్తే జనాల నవ్వుతారంటే దానికి నేను సిద్దమే అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే తాజాగా సుమ తన యూట్యూబ్ చానెల్‌లో సుధీర్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి చెప్పింది. సుమక్క అనే యూట్యూబ్ చానెల్‌లో ఈట్ టాక్ అనే షో వస్తుంది. ఆ ప్రోగ్రాం కింద వచ్చే కామెంట్లను తాజాగా సుమ చదివింది. అందులో సుధీర్‌తో చేసిన ఎపిసోడ్‌కు మాత్రం రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయని అదే సుధీర్ పవర్, క్రేజ్ అంటూ జై సుధీర్ అన్న అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. అవును అది నిజమే ఇంత తక్కువ సమయంలో రెండు మిలియన్ల వ్యూస్ అంటే కేవలం సుధీర్ వల్లే వచ్చాయ్.. సుధీర్ అన్న తోపు అంటూ సుమ కూడా అనేసింది.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి